తిరుపతి ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెంచిందా?
వైసీపీ అధినేత జగన్ బీజేపీకి దూరమవుతున్నారా? తాను ఎంత సంయమనం పాటిస్తున్నా బీజేపీ చేస్తున్న వ్యవహారాలపై జగన్ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు తిరుపతి పార్లమెంటు ఉప [more]
వైసీపీ అధినేత జగన్ బీజేపీకి దూరమవుతున్నారా? తాను ఎంత సంయమనం పాటిస్తున్నా బీజేపీ చేస్తున్న వ్యవహారాలపై జగన్ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు తిరుపతి పార్లమెంటు ఉప [more]
వైసీపీ అధినేత జగన్ బీజేపీకి దూరమవుతున్నారా? తాను ఎంత సంయమనం పాటిస్తున్నా బీజేపీ చేస్తున్న వ్యవహారాలపై జగన్ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు వేదికగా మారాయి. నిన్న మొన్నటి వరకూ జగన్ కు రాష్ట్ర బీజేపీ నేతలతో పెద్దగా అభిప్రాయ బేధాలు లేవు. కేంద్ర ప్రభుత్వం తో సయోధ్య కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవాలని జగన్ మొన్నటి వరకూ భావించారు.
తమను టార్గెట్ చేయడంతో…
కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. మత మార్పిడులు, హిందూదేవాలయాలపై దాడులు వంటి సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీని టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆరోపణలే వారు చేస్తున్నారు. దీంతో పాటు అనేక అంశాల్లో జగన్ కు, కేంద్ర నాయకత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. తాను విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాసినా కనీస స్పందన లేకపోవడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ….
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగైనా బీజేపీ ఆధిపత్యానికి రాష్ట్రంలో ఆదిలోనే తుంచి వేయాలని జగన్ నిర్ణయించారని చెబుతున్నారు. ఈ మేరకు మంత్రులకు, సీనియర్ నేతలకు జగన్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీపై విమర్శల జోరును పెంచాలని జగన్ నిర్ణయించడంతోనే ఈ మధ్యకాలంలో బీజేపీపై విరుచుకుపడుతున్నారు.
అందుకే మంత్రుల మాటల దాడి….
జనసేన పార్టీ బీజేపీలో చేరిన నాటి నుంచి కొద్దికొద్దిగా గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా సునీల్ దేవ్ ధర్ చేసిన వ్యాఖ్యలు కూడా జగన్ ను ఇబ్బంది పెట్టాయి. జగన్ జైలుకు వెళతాడన్న ఆయన వ్యాఖ్యలను వైసీపీి సీరియస్ గా తీసుకుంది. అందుకే సునీల్ దేవ్ ధర్ పై మంత్రులు మాటల దాడి చేశారంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికతో జగన్ బీజేపీతో అమితుమీ తేల్చుకోవడానికే సిద్ధమయ్యారన్నది పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.