జగన్ ని అరెస్ట్ చేసే దమ్ముందా ?
జగన్ ఏపీ సీఎం. అంతకంటే కూడా ఏపీలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీకి అధినేత. ఆయన ముఖ్యమంత్రి కాక ముందే నానా కష్టాలు పడి రాటుదేలిన నేత. [more]
జగన్ ఏపీ సీఎం. అంతకంటే కూడా ఏపీలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీకి అధినేత. ఆయన ముఖ్యమంత్రి కాక ముందే నానా కష్టాలు పడి రాటుదేలిన నేత. [more]
జగన్ ఏపీ సీఎం. అంతకంటే కూడా ఏపీలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీకి అధినేత. ఆయన ముఖ్యమంత్రి కాక ముందే నానా కష్టాలు పడి రాటుదేలిన నేత. ఆయనకు కేసులు, అరెస్టులు, జైళ్ళు అంటే భయం అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. జగన్ దూకుడుగా రాజకీయాలు చేస్తాడు. అటువంటి జగన్ ని జైలు పేరు మీదో బెయిల్ రద్దు అంటూనే బెదిరిస్తే అసలు లొంగుతారా. ఇది జన సామాన్యంలో ఉన్న చర్చనే. దాన్నే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ప్రస్థావిస్తున్నారు.
అది దుస్సాహసమే …?
జగన్ బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని కేంద్ర పెద్దలు ఆలోచన కనుక చేస్తే అది దుస్సాహమే అవుతుందని ఉండవల్లి అంటున్నారు. వారు అలాంటి పనికి ఒడిగడతారు అని తాను అనుకోవడంలేదని కూడా ఉండవల్లి చెబుతున్నారు. జగన్ విషయంలో ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సింది లేదన్నదే ఉండవల్లి అభిప్రాయంగా ఉంది. ఒకవేళ కేంద్ర పెద్దలు కూడా అలాగే ఆలోచన చేస్తే మాత్రం అది జగన్ కే మేలు అంటున్నారు ఉండవల్లి.
అక్కడ నుంచే పాలన….
జగన్ కి జైలు కొత్త కాదు అని ఉండవల్లి చెబుతూ అక్కడ నుంచే పాలించగల సమర్ధుడు జగన్ అని అంటున్నారు. జగన్ విషయంలో బీజీపీ నేతలకు ఏ రకమైన అప్షన్లు లేకపోతేనే అరెస్ట్ దాకా వస్తారేమో అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ ఏపీ ప్రయోజనాల గురించి గొంతు ఎత్తాల్సిన సమయం ఇదేనని కూడా ఉండవల్లి సూచిస్తున్నారు. జగన్ సైతం దేనికీ భయపడే రకం కాదని ఆయన విశ్లేషిస్తున్నారు. జగన్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సహా ఏపీకి సంబంధించి ప్రతీ దాని మీద నిలదీసి కేంద్రంతో తేల్చుకోవాలని కూడా ఉండవల్లి సూచిస్తున్నారు.
ఢీ కొడితేనే…?
బీజేపీ పెద్దలను ఢీ కొడితేనే ఎవరికైనా మనుగడ అని కూడా ఉండవల్లి లాంటి మాట. బీజేపీ పెద్దల వ్యవహారం పరిగెడితేనే వెంటబెట్టేలా ఉంటుందని కూడా చెబుతున్నారు. మరి ఉండవల్లి సలహాలు బాగానే ఉన్నాయి కానీ జగన్ కి కూడా ఇలాంటి విషయాల్లో తనదైన ఆలోచన, విశ్లేషణ ఉంటాయని కూడా వైసీపీ నేతలు అంటున్న మాట. జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్నది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. జైలుకు వెళ్ళి మళ్ళీ కటకటాల నడుమ గడపడం జగన్ కి అభ్యంతరం కాకపోవచ్చు. అదే సమయంలో మిగిలిన విషయాలను కూడా ఆయన పరిగణంలోకి తీసుకునే సహనంగా ఉంటున్నారు అన్నది వైసీపీ నేతల మాట. తాను ఆవేశపడితే రాష్ట్ర మరింతగా నష్టపోకూడదన్నదే జగన్ ఆలోచన అని వారు చెబుతున్నారు. మొత్తానికి జగన్ విషయంలో బీజేపీ అడుగు ముందుకు వేస్తుందా జగనే ఢీ కొడతారా అనంది ఫ్యూచర్ పాలిటిక్స్ లో చూడాల్సిందే.