జగన్ స్కూల్ వేరట.. పొలిటికల్ ఫిలాసఫీ అంతే?
రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ఎక్కువగా మిత్రుల కోసం తాపత్రయపడడం సహజం. వీలైనంతవరకూ వివాదాలు లేకుండా చూసుకోవాలని భావిస్తారు. ఎక్కువగా తమకు మద్దతు ఇచ్చేవారిని పక్కన [more]
రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ఎక్కువగా మిత్రుల కోసం తాపత్రయపడడం సహజం. వీలైనంతవరకూ వివాదాలు లేకుండా చూసుకోవాలని భావిస్తారు. ఎక్కువగా తమకు మద్దతు ఇచ్చేవారిని పక్కన [more]
రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ ఎక్కువగా మిత్రుల కోసం తాపత్రయపడడం సహజం. వీలైనంతవరకూ వివాదాలు లేకుండా చూసుకోవాలని భావిస్తారు. ఎక్కువగా తమకు మద్దతు ఇచ్చేవారిని పక్కన ఉంచుకుంటే రాజకీయం సులువు అవుతుందని కూడా తలపోస్తాయి. అయితే జగన్ పొలిటికల్ ఫిలాసఫీయే వేరు. ఆయన ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయరు. అసలు ఆ స్కూలే అతనిది కాదు. ఆ మాటకు వస్తే జగన్ ఏ పొలిటికల్ స్కూల్ లో చదువుకోలేదు. అదే ఆయన చేత కొత్త పుంతలు తొక్కేలా చేస్తోంది.
అందరూ శత్రువులే ….?
ఏపీ రాజకీయాలను ఒక్కసారి పరికించి చూస్తే జగన్ గురించి సొంత పార్టీ వారు తప్ప మిగిలిన వారు ఎవరూ ఒక్క మంచి మాట మాట్లాడరు, నష్టాలలో కూరుకుపోయిన ఆర్టీసీ వంటి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసినా, పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలను విస్తారంగా అమలు చేస్తున్నా వామపక్షాలు అసలు పట్టించుకోవు, ఇక కొత్తగా దేవాలయాలు కడుతూ టీటీడీ వంటి చోట్ల సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నా కూడా బీజేపీ కనీసంగా బాగుంది అనదు. ఇక అధికారం తన నుంచి లాక్కున్నారన్న అక్కసుతో టీడీపీ ఎపుడూ నిందిస్తునే ఉంటుంది. ఆఖరుకు ఏపీలో ఉనికి లేకుండా పోయిన కాంగ్రెస్ నుంచి ఏ తులసిరెడ్డి వంటి వారో, మాజీ ఎంపీ చింతా మోహన్ లో తమ బాణాలను జగన్ మీదనే ఎక్కుపెడతారు. జనసేన పవన్ కళ్యాణ్ కి వైఎస్ ఫ్యామిలీ అంటే ఎంత మంటో పంచెలూడగొడతామని ఆనాడు గర్జించిన నాటి నుంచే అందరికీ తెలుసు.
తిడుతూంటేనే…?
కొందరు అందరూ పొగడాలని అనుకుంటారు. కానీ జగన్ మాత్రం తిట్టేవారినే కోరుకుంటారు. తెల్లారుతూనే తనని పది మంది తిడుతూంటే అదే తనకు పబ్లిసిటీగా మార్చుకోవడంలోనే జగన్ మార్క్ పాలిటిక్స్ ఉందని అంటారు. పది మంది కలసి ఒకరిని పట్టుకుని నిందిస్తున్నారు అంటే ఆ వ్యక్తి మీద సహజంగానే జనాల్లో సానుభూతి వస్తుంది. అతను చేస్తున్నది తప్పా రైటా అన్నది పక్కన పెడితే జనం ఆయన మీద పూర్తిగా దృష్టి పెడతారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే ఇదే జరుగుతోంది. ఆయన కొండను ఢీ కొట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ ఆయన్ని అంతా విమర్శిస్తూనే ఉన్నా ఫుల్ సైలెంట్ గా ఉంటారు. తన పని తాను చేసుకుంటూ పోతారు. అదే ఆయన సక్సెస్ సీక్రేట్ అనుకోవాలేమో.
ఓట్లు చీలిపోయి…?
ఎన్నికల లెక్కలు కూడా ఇదే చెబుతున్నాయి. జగన్ ని పది పార్టీలు తిడుతున్నాయి. దాంతో వ్యతిరేక ఓట్లు అలా ఎపుడూ చీలిపోతున్నాయి. ఇక మెచ్చే వారు ఏకమొత్తంగా జగన్ కే ఓటు వేస్తారు. ఇదే ట్రెండ్ 2014 నుంచి సాగుతోంది. జగన్ కి 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీ రావడానికి కూడా ఇదే కారణం అయింది. మొత్తానికి జగన్ కి రాజకీయ శత్రువులే మేలు చేస్తున్నారు అన్న విశ్లేషణ అయితే ఉంది.