జగన్ ను అలా దెబ్బ తీస్తారా..?
తనకంటే బలవంతుడిని కొట్టాలంటే ప్రత్యామ్నాయాలు వెదకాలి. ఎక్కడో ఒక బలహీనమైన పాయింట్ ఉంటుంది. దానిని పట్టుకుంటే కంట్రోల్ చేయడం సులభమవుతుంది. యుద్ధంలోనూ, ఆటల్లోనూ, రాజకీయాల్లోనూ ప్రత్యర్థుల బలహీనతలను [more]
తనకంటే బలవంతుడిని కొట్టాలంటే ప్రత్యామ్నాయాలు వెదకాలి. ఎక్కడో ఒక బలహీనమైన పాయింట్ ఉంటుంది. దానిని పట్టుకుంటే కంట్రోల్ చేయడం సులభమవుతుంది. యుద్ధంలోనూ, ఆటల్లోనూ, రాజకీయాల్లోనూ ప్రత్యర్థుల బలహీనతలను [more]
తనకంటే బలవంతుడిని కొట్టాలంటే ప్రత్యామ్నాయాలు వెదకాలి. ఎక్కడో ఒక బలహీనమైన పాయింట్ ఉంటుంది. దానిని పట్టుకుంటే కంట్రోల్ చేయడం సులభమవుతుంది. యుద్ధంలోనూ, ఆటల్లోనూ, రాజకీయాల్లోనూ ప్రత్యర్థుల బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ పైచేయి సాధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ కేంద్రానికి కంట్లో నలుసుగానే ఉంది. సైద్దాంతికంగా పోలికలు లేని వైసీపీ ఎప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేసినా కేంద్ర నాయకత్వానికి తలపోటే. జాతీయ స్థాయిలో నాలుగో అతిపెద్ద పార్టీ కావడం వైసీపీ కి ప్లస్ పాయింట్ . అందుకే ప్రాంతీయ పార్టీలు, వామపక్షాలు ఈ పార్టీ కేంద్రంగా బీజేపీతో పోరు చేయడానికి తహతహలాడుతున్నాయి. దర్యాప్తు సంస్థల బలహీనతలతో జగన్ ముందడగు వేయలేకపోతున్నారు. దానికితోడు మరో అస్త్రం చేజిక్కించుకోవడానికి, రాష్ట్ర నాయకత్వాన్ని కంట్రోల్ లో పెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక అస్త్రంతో అష్టదిగ్బంధనం చేయాలనేది కేంద్రం వ్యూహం. సాంకేతికంగా చూస్తే తమదేమీ తప్పే లేనట్లు కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి మాత్రం కాలు చేయి ఆడని పరిస్థితి ఏర్పడుతుంది.
అస్తవ్యవస్తం..
అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టారు. కొత్త రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడలేదు. అయినప్పటికి అన్ని వర్గాల ప్రజలు తన పాలన పట్ల సంతృప్తి కరంగా ఉండాలనేది వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం. దేశంలో ఎక్కడా లేని స్కీములను ఆచరణలో పెట్టింది. ఈవిషయంలో ముందు వెనకలు ఆలోచించలేదు. రెండేళ్ల వ్యవధిలోనే లక్షాయాభై వేల కోట్ల రూపాయల పైచిలుకు అదనపు అప్పులు తేవాల్సి వచ్చింది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో సరిసమానంగా రుణం చేస్తున్నారు. నిజానికి చేసే ఖర్చులో 25 శాతం మించి అప్పు చేస్తే ఆ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లే. అయితే ఆంద్రప్రదేశ్ లో ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నడుస్తోంది. ఇదొక విచిత్రమైన పరిస్థితి. రకరకాల కట్టడి మార్గాలు ఉన్నప్పటికీ కొత్త దారుల్లో రుణాలు తెస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తన వైఖరిని పూర్తిగా మార్చుకోవడమే ఇందుకు కారణం. 2014లో రైతు రుణమాఫీ హామీ ఇవ్వకపోవడం వల్లనే తాను అధికారంలోకి రాలేకపోయాననేది ఆయన నమ్మకం. ఇకపై తన ప్రభుత్వానికి ఢోకా ఉండకూడదనుకుంటున్నారు. ప్రతిపక్షాలు సమీప భవిష్యత్తులో వైసీపీ వైపు తొంగి చూసే సాహసం కూడా చేయకూడదనుకుంటున్నారు. అందుకే ప్రజలను అన్నివిధాలా సంతృప్తి పరిచే పనిలో పడ్డారు. ఈ దూకుడులో కొన్ని వాస్తవాలు మరుగున పడిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పడు వాటిని చక్కగా వినియోగించుకుంటూ వైసీపీకి ముందరికాళ్లకు బంధం వేయాలనుకుంటోంది.
అందివచ్చిన చాన్సు..
20 సంవత్సరాల క్రితం వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే వ్యయంలో మూడింట రెండు వంతులు ప్రణాళికేత వ్యయంగా, ఒక వంతు ప్రణాళిక వ్యయంగానూ ఖర్చు పెడుతుండేవి. అంటే వంద రూపాయల ఆదాయం వస్తే అందులో దాదాపు 67రూపాయలు జీతభత్యాలు, పింఛన్లు, ప్రభుత్వ నిర్వహణ వంటి వాటికి కేటాయించేవారు. దీనినే ప్రణాళికేతర వ్యయమని పిలిచేవారు. అభివృద్ధికార్యక్రమాలు, ప్రాజెక్టులు, సంపద సృష్టికి నూటికి 33 రూపాయలను వినియోగించేవారు. దీనికి ప్రణాళిక వ్యయంగా పేరుండేది. గడచిన అయిదారు సంవత్సరాలుగా వీటి పేర్లు మార్చేశారు. రెవిన్యూ వ్యయం, పెట్టుబడి వ్యయంగా ప్రస్తుతం చెలామణి లో ఉన్నాయి. కానీ గడచిన పదిహేను సంవత్సరాలుగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం తమప్రాధాన్యాలను సవరించుకున్నాయి. సంక్షేమ పథకాలు, జీతభత్యాల పద్దు విపరీతంగా పెరిగిపోయింది. దాంతో పెట్టుబడి, అభివృద్ధి , సంపద సృష్టి ఖర్చుకు ఎగనామం పెడుతూ వస్తున్నాయి. ఇరవై సంవత్సరాల క్రితం నూటికి 33 రూపాయల వరకూ ప్రణాళిక వ్యయం చేస్తే ఇప్పుడది పదిరూపాయల లోపునకు పడిపోయింది. అప్పు చేసి పప్పుకూడుగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. భవిష్యత్ తరాలకు ఉపయోగించే అభివృద్ధిని పక్కనపెట్టేశాయి. దీనిని గమనించి 15 వ ఆర్థిక సంఘం ప్రభుత్వ పద్దులో కనీసం పదిహేను శాతమైనా పెట్టుబడి వ్యయం ఉండాలి. సంపద సృష్టికి కేటాయించాల్సిందేనని సిఫారసు చేసింది. దీనిని అస్త్రంగా చేసుకుంటూ ఆందప్రదేశ్లో జగన్ ప్రభుత్వ అజెండాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది కేంద్రం.
అదొక్కటే చాయిస్..
ఏటా లక్షా డెబ్భై వేల కోట్ల రూపాయల వరకూ కనీస వ్యయం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో కనీసం 25 వేల కోట్ల రూపాయలను అయినా పెట్టుబడి వ్యయంగా సంపద సృష్టికి వినియోగించాలి. ఇప్పటికే రకరకాల పథకాలతో సతమతమవుతున్న ప్రభుత్వానికి ఇది దాదాపు అసాధ్యం. జీతాలు, పింఛన్లకు సైతం రుణాలను తెచ్చుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ వస్తోంది. పెట్టుబడి వ్యయం చట్టబద్ధంగా చేయాలి. లేకపోతే రుణాలు తీసుకునే వెసులుబాటును కుదిస్తామంటూ కేంద్రం హెచ్చరిస్తోంది. సాంకేతికంగా ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగిస్తామంటోంది. అదే జరిగితే రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోతుంది. గడచిన రెండేళ్లలో మొత్తం ఆదాయం, తెచ్చిన రుణాల్లో 95 శాతం సంక్షేమ పథకాలు, జీతభత్యాలు, ప్రభుత్వ ఖర్చులకే సరిపోయింది. పెట్టుబడి వ్యయం నామమాత్రంగానే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం విధి విధానాలతో రానున్న కాలంలో జీతభత్యాలకూ కటకట ఎదురవుతుంది. తెచ్చిన అప్పులను సంక్షేమపథకాలకు, జీతాలకు వెచ్చిస్తున్నారు. అలా కుదరదంటూ కేంద్ర ఆర్థిక శాఖ నిషేధం విధిస్తోంది. ఇది రాష్ట్రానికి పెద్ద గండమే. సంక్షేమ పథకాలు, జీతభత్యాల్లో ఏమాత్రం తేడా వచ్చినా ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతుంది. అది రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఎన్నికలు, సీట్లు, ఓట్లు వంటి మార్గాల్లో నేరుగా జగన్ ప్రభుత్వాన్ని ఢీ కొట్టడం సాధ్యం కాదు. అయితే ఈ ఆర్థిక మార్గంలో మాత్రం కేంద్రం కనుసన్నల్లోకి వెళ్లక తప్పని అనివార్యత ఏర్పడుతోంది.
-ఎడిటోరియల్ డెస్క్