మోసం చేసిన వారికి నో ఛాన్స్
ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇస్తున్నారు. అదే తనను వీడివెళ్లి పోయి తిరిగి వచ్చినా వారిని మాత్రం పట్టించుకోవడం [more]
ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇస్తున్నారు. అదే తనను వీడివెళ్లి పోయి తిరిగి వచ్చినా వారిని మాత్రం పట్టించుకోవడం [more]
ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇస్తున్నారు. అదే తనను వీడివెళ్లి పోయి తిరిగి వచ్చినా వారిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకసారి తనను వీడివెళితే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు కన్పిస్తుంది. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదు. 2014 ఎన్నికలలో తన పార్టీ గుర్తుమీద గెలిచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు వెళ్లిపోయారు.
తిరిగి వస్తామంటూ…..
ఇందులో కొంతమంది తిరిగి వస్తామని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా జగన్ మాత్రం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రకు చెందిన కొందరు నేతలు తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు సీనియర్ నేతల ద్వారా ప్రయత్నాలు చేశారు. తమను పార్టీలోకి తీసుకుంటే చాలునని వారు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల జగన్ దృష్టికి వెళ్లింది. అయితే వారు వచ్చినా ఇక్కడ ఎటువంటి అవకాశాలు ఉండవని చెప్పాలని జగన్ తెలిపినట్లు సమాచారం.
వీరిద్దరినీ కూడా….
నిజానికి ఎన్నికలకు ముందే కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు అప్పటి ఎంపీ బుట్టారేణుకలు పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందు కావడంతో వారు తన నుంచివెళ్లిపోయినా తిరిగి జగన్ పార్టీలోకి తీసుకున్నారు. టీడీపీలో టిక్కెట్ రాకపోవడం వల్లనే తనవద్దకు వచ్చారని జగన్ భావించారో ఏమో, ఇప్పటి వరకూ వారిని పట్టించుకోలేదు. కర్నూలు పర్యటనకు వెళ్లిన జగన్ ను వారు కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు.
నమ్మివచ్చిన వారికి…..
వచ్చే ఎన్నికల్లోనూ తనను కాదని పార్టీ మారి వెళ్లి వచ్చిన వారికి టిక్కెట్లు దక్కవని జగన్ నిర్మొహమాటంగా చెబుతున్నారట. తొలుత తనను నమ్మివచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పండుల రవీంద్ర బాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవులను ఇచ్చారు. రామసుబ్బారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నారు. కానీ తనను వదలి వెళ్లి తిరిగొచ్చినా వారికిమాత్రం ఎలాంటి పదవులు ఉండవని జగన్ చెప్పేశారట. దీంతో జగన్ ను వదలివెళ్లి తిరిగి రావాలనుకుంటున్న నేతలు ఆలోచనలో పడిపోయారట.