జగన్ నిర్ణయం సరైనదేగా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వయసులో చిన్న వాడైనా నిర్ణయం సరైనదే తీసుకుంటారని మరోసారి రుజువయింది. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడాన్ని విపక్షాలన్నీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వయసులో చిన్న వాడైనా నిర్ణయం సరైనదే తీసుకుంటారని మరోసారి రుజువయింది. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడాన్ని విపక్షాలన్నీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వయసులో చిన్న వాడైనా నిర్ణయం సరైనదే తీసుకుంటారని మరోసారి రుజువయింది. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడాన్ని విపక్షాలన్నీ తప్పుపట్టాయి. కరోనా వ్యాప్తికి కారణం కాకూడదనే తాను ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకుంటున్నట్లు జగన్ ప్రకటించినా కొందరు టీడీపీ నేతలు వెటకారం చేశారు. ఓటమి భయంతోనే జగన్ సభను రద్దు చేసుకున్నారని ఎల్లో మీడియా సయితం ప్రచారం చేసింది.
కేసీఆర్ సభ పెట్టి….
కానీ పొరుగు రాష్ట్రంలో పరిస్థితిని చూస్తే జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనని చెప్పకతప్పదు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో లక్షమందితో బహిరంగ సభ పెట్టారు. ఈ హాలియా సభలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకిందంటున్నారు. అలాగే ఆ సభలో పాల్గొన్న అనేక మంది నేతలు కూడా కరోనా బారిన పడ్డారు. ఒక్కరోజులోనే సాగర్ ప్రాంతంలో 160 కేసులు నమోదయ్యాయంటే అది సభ కారణమేనని చెప్పక తప్పదు.
తిరుపతి సభ పెట్టి ఉంటే…?
అదే జగన్ తిరుపతిలోనూ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 14వ తేదీన సభ జరగాల్సి ఉంది. కానీ జగన్ తిరుపతి నియోజకవర్గం ప్రజలకు లేఖలు రాసి పర్యటనను రద్దు చేసుకున్నారు. తాను సభ పెడితే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందని, ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టడం తనకు ఇష్టం లేదని జగన్ ఆ లేఖలో వివరించారు. జగన్ సభ పెడితే లక్షలాది మంది కార్యకర్తలు హాజరవుతారు. అధికార పార్టీ కావడంతో ఎమ్మెల్యేలు కూడా జనాలను సమీకరించడంలో బలసమీకరణ చేస్తారు.
రద్దు మంచిదే అయిందిగా?
కానీ జగన్ సభను రద్దు చేసుకోవడం ఇప్పుడు మంచిదే అయిందంటున్నారు. లేకుంటే అనేక మంది కరోనా బారిన పడి ఉండే వారు. టీడీపీ ప్రచారంలోనూ అనేక మంది ముఖ్య నేతలకు కరోనా సోకింది. అయినా టీడీపీ నేతలు జగన్ ఓటమి భయంతోనే ప్రచారానికి రాలేదని విమర్శలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితిని గమనిస్తే ఆ ఆరోపణలు చేసిన వారు ఇప్పుడేమంటారు? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరైనదే ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.