సంక్షేమ శాఖలు ఏమవుతాయ్? ఇదేంది జగనన్నా?
‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆన్లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ [more]
‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆన్లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ [more]
‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆన్లైన్ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అయితే.. ఈ నిధుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన సొమ్ములు ఏమైనా ఉన్నాయా ? అంటే.. లేవు. వివిధ సామాజిక వర్గాల సంక్షేమం కోసం.. కేటాయించే నిధులనే గుండుగుత్తుగా చూపించి.. వీటినే విద్యాదీవెన కింద విడుదల చేశారు. దీనిపై ఇప్పుడు ఆయా సంక్షేమ శాఖలకు చెందిన ప్రజలకు లబోదిబోమంటున్నారు. మాకు కేటాయించిన నిధులు విద్యార్థులకు ఎలా ఇస్తారని.. ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలే తెరమీదకి వస్తున్నాయి.
బీసీ సంక్షేమ శాఖలో….
రూ.491.42 కోట్లు (బీసీ విద్యార్థులతో పాటు ఈబీసీ, కాపు విద్యార్థులకు), ఎస్సీ సంక్షేమ శాఖ రూ. 119.25 కోట్లు (ఎస్సీ విద్యార్థుల కోసం), ఎస్టీ సంక్షేమ శాఖ రూ.19.10 కోట్లు(ఎస్టీ విద్యార్థుల కోసం), మైనారిటీ సంక్షేమ శాఖ రూ.41.68 కోట్లు(మైనార్టీ విద్యార్థుల కోసం) కేటాయించారు. వాస్తవానికి ఈ నిధులు వ్యక్తిగతంగా ఆయా శాఖల ద్వారా ఆయా సామాజిక వర్గాల అభ్యున్నతికి వెచ్చించాలి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం వీటినే విద్యాదీవెన కింద జమ చేస్తుండడం గమనార్హం. అంటే.. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆయా శాఖలకు కేటాయించిన నిధులు లేవన్న మాట.
ఆ సామాజికవర్గాల నుంచి….
దీనిపై ఆయా సామాజిక వర్గ ప్రజలనుంచి జగన్ పై వ్యతిరేకత వస్తోంది. “ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా.. మా సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. గత ఎన్నికల సమయంలో మాకు కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామన్నారు. ఈ ప్రతిపాదన ఇప్పటికీ సాకారం కాలేదు. ఇతర పథకాలకు కూడా నిధులు ఇవ్వడం లేదు. ఇప్పుడు కేవలం సామాజిక పథకాలకు కేటాయించడం ఏమేరకు సరైంది?“ అని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే సామాజిక వర్గాలకు కేటాయించిన నిధులను వారికే వెచ్చించారు.కానీ, ఇప్పుడు జగన్ వాటికి కేటాయించిన నిధులను కూడా ఇతర పథకాలకు ళ్లిస్తున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. మరి దీనిపై ఏమంటారో చూడాలి.