జగన్ స్కీం ఎందుకో ఇప్పటికైనా అర్థమయిందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో పేద వర్గాలను ఆకట్టుకుంటున్నారు. గత రెండేళ్ల నుంచి తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. పేదలు పార్టీకి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో పేద వర్గాలను ఆకట్టుకుంటున్నారు. గత రెండేళ్ల నుంచి తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. పేదలు పార్టీకి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో పేద వర్గాలను ఆకట్టుకుంటున్నారు. గత రెండేళ్ల నుంచి తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. పేదలు పార్టీకి అండగా ఉంటే ఢోకాలేదని భావించిన జగన్ సంక్షేమాన్ని మాత్రం ఆపడం లేదు. కరోనా కష్టసమయంలోనూ జగన్ వివిధ పథకాల ద్వారా నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో కొన్ని వర్గాల ప్రజలు జగన్ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
పేద వర్గాలను….
పేద వర్గాలు జగన్ కు అండగా ఉన్నందునే మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయగలిగారు. రాజధాని అమరావతి వంటి సమస్య ఉన్న చోట, విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ ఇబ్బంది ఉన్న చోట కూడా జగన్ జెండా ఎగురవేయగలిగారంటే దానికి కారణం పేద వర్గాలే. క్యూలో నిల్చుని ఓటు వేసి మరీ ప్రభుత్వానికి అండగా నిలిచారు. అందుకే విశాఖ, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లను వైసీపీ దక్కించుకుంది.
మధ్యతరగతి ప్రజలను….
ఇక మరో కీలకమైన వర్గం మధ్యతరగతి. ఈ వర్గాల ప్రజలు ప్రతి ఎన్నికల్లో కీలకంగా మారతారు. ఏమాత్రం వీరిని నిర్లక్ష్యం చేసినా ఇబ్బంది తలెత్తుంది. అందుకే వీరిని లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే ఆరోగ్యశ్రీని అమలు చేశారు. ఏడాదికి ఐదు లక్షల ఆదాయం ఉన్నవారందరికీ ఆరోగ్యశ్రీని జగన్ వర్తింప చేశారు. ఈ పథకం కరోనా కష్ట సమయంలో తమను ఆదుకుందని మధ్యతరగతి వర్గాలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
స్మార్ట్ టౌన్లు….
వీరిని మరింత దరి చేర్చుకునేందుకు జగనన్న స్మార్ట్ టౌన్లు కూడా మరింత ఉపయోగపడతాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 150, 200, 240 చదరపు గజాలను ప్రభుత్వమే అభివృద్ధి చేసి ఇస్తుంది. లాభాపేక్ష లేకుండా ధరలను నిర్ణయిస్తుండటంతో సొంత ఇంటిని సాకారం చేసుకునేందుకు మధ్యతరగతి ప్రజలు క్యూకడుతున్నారు. ఈ స్కీమ్ కింద దాదాపు 3.79 లక్షల మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ స్కీమ్ కూడా జగన్ కు ఓట్ల పంట పండిస్తుందన్న అంచనాలో ఉన్నారు. మొత్తం మీద జగన్ స్కీమ్ లతోనే జనం ముందుకు వెళుతున్నారు. సక్సెస్ అయితే జగన్ కు ఎదురు లేనట్లే.