టార్గెట్ జగన్: ఆ ముగ్గురి దారి ఏంటి ?
టార్గెట్ జగన్.. అయితే.. ఇదేదో.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సంబంధించిన విషయం కాదు. ముగ్గురు నాయకులు.. భిన్నమైన సామాజిక వర్గాలకు చెందినవారు.. ఇప్పుడు జగన్ టార్గెట్‌గా రాజకీయాలు [more]
టార్గెట్ జగన్.. అయితే.. ఇదేదో.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సంబంధించిన విషయం కాదు. ముగ్గురు నాయకులు.. భిన్నమైన సామాజిక వర్గాలకు చెందినవారు.. ఇప్పుడు జగన్ టార్గెట్‌గా రాజకీయాలు [more]
టార్గెట్ జగన్.. అయితే.. ఇదేదో.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి సంబంధించిన విషయం కాదు. ముగ్గురు నాయకులు.. భిన్నమైన సామాజిక వర్గాలకు చెందినవారు.. ఇప్పుడు జగన్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. అందులోనూ.. ఒకరు వైసీపీ టికెట్‌పై గత ఎన్నికల్లో విజయం సాధించిన నాయకుడే. మరొకరు రాజకీయాలకు దూరంగా ఉన్న మహామేధావి. ఇక, మరొకరు.. టీడీపీలో ఉన్నారో.. లేదో తెలియని.. టీడీపీ నాయకుడు. ఇప్పుడు వీరి లక్ష్యం మొత్తం.. ఏపీ సీఎం జగన్. జగన్‌ను టార్గెట్ గా చేసుకుని వీరు చేస్తోన్న విమర్శలు చూస్తుంటే రకరకాల సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయి.
నేపథ్యం వేరయినా…?
వీరు జగన్‌ను టార్గెట్ చేస్తోన్నా వీరి నేపథ్యం మాత్రం వేరు. వీరు భిన్నమైన పార్టీలకు చెందిన వారు.. భిన్నమైన ప్రాంతాలకు చెందిన వారు.. భిన్నమైన సామాజిక వర్గాలకు చెందినవారు.. వీరంతా జగన్‌పై మూకుమ్మడిగా దాడి చేయడం ఎందుకు ? ఏం జరిగింది ? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సరే.. ఇంతకీ వీరెవరు.? అంటే.. ఒకరు వైసీపీ నుంచి విజయం సాధించిన ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, రెండు.. మాజీ ఎంపీ.. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సబ్బం హరి..(ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ.. యాక్టివ్‌గా మాత్రం లేరు) మూడు.. ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉండి.. తను చెప్పేది ఎంతో దూరదృష్టితో చెబుతున్నానని చెప్పే.. మాజీ ఎంపీ.. ఉండవల్లి అరుణ్‌కుమార్.
నేరుగా విమర్శిస్తూ….
వీరు నోరు విప్పితే.. టార్గెట్ వైఎస్ జగన్. సబ్బంహరి కానీ, రఘురామకృష్ణరాజు కానీ.. నేరుగా జగన్‌ను విమర్శిస్తున్నారు. ఇక, ఉండవల్లి.. జగన్ మంచి కోరుకుంటున్నట్టుగా ఉంటూనే ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 'మీకు జైలు కొత్తా..?“ అంటూ.. కొన్ని రోజుల కిందట ఉండవల్లి తీవ్ర విమర్శలు చేశారు. ఇక, రఘురామ ఏకంగా.. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.
జగన్ లో మార్పా…?
ఇక, సబ్బం హరి కూడా ఇదే తరహాలో వారాంతపు కొలువు (అనుకూలమీడియాలో డిబేట్) పెట్టిమరీ.. జగన్‌పై విరుచుకుపడుతున్నారు. మొత్తంగా చూస్తే.. వీరి టార్గెట్ మాత్రం జగన్. ఇంతకీ వీరు ఆశించేదేంటి? అంటే.. ప్రభుత్వం మార్పా.. లేక జగన్ మార్పా? అనేది ఒక అనిశ్చిత పరిస్థితి!! ఇక, ఈ ముగ్గురిని కట్టడి చేయడంపై వైసీపీ కూడా దృష్టి పెట్టడం లేదు. ప్రజలు పట్టించుకోవడం లేదనో.. ఔట్ డేటెడ్ నేతలు అయిపోయారనో భావిస్తున్నట్టుంది. కానీ, మేధావుల మధ్య మాత్రం ఈ ముగ్గురి గురించి చర్చనడుస్తుండడం గమనార్హం.