జగన్ ప్రకటన.. మంత్రులను ఇరికించేసిందా ?
ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన.. మంత్రులను అడ్డంగా ఇరికించేసిందా ? ఇప్పుడు అడ్డంగా వారు దొరికి పోతున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు. గతంలో లేని [more]
ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన.. మంత్రులను అడ్డంగా ఇరికించేసిందా ? ఇప్పుడు అడ్డంగా వారు దొరికి పోతున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు. గతంలో లేని [more]
ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన.. మంత్రులను అడ్డంగా ఇరికించేసిందా ? ఇప్పుడు అడ్డంగా వారు దొరికి పోతున్నారా ? అంటే.. ఔననే అంటున్నారు. గతంలో లేని విధంగా ఇప్పుడు మంత్రులపై ఒక విధమైన విమర్శ జోరుగా వినిపిస్తోంది. చంద్రబాబు పాలనాకాలంలో కూడా సాధారణంగా మంత్రులపై విమర్శలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. మంత్రుల వ్యవహారం.. శాఖల పనితీరుపై ఎప్పుడూ ఉండే విమర్శలకు భిన్నంగా ఇప్పడు వైసీపీ మంత్రులపై సరికొత్త విమర్శలు వస్తున్నాయి.
జాబ్ రెన్యువల్ అంటూ….?
టీడీపీ నేతలు.. మంత్రులను టార్గెట్ చేస్తూ.. ఒక కామెంట్ చేస్తున్నారు. “ ఈ మంత్రి టీడీపీపై ఇంత రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారంటే.. ఆయన 'జాబ్ రెన్యువల్' కోరుకున్నట్టున్నారు. అందుకే లేనివి కూడా పోగేసి విమర్శలు చేస్తున్నారు.“ అంటూ.. గాలి తీసేస్తున్నారు. దీంతో అసలు విషయం.. పక్కకు పోయి.. కేవలం టీడీపీ నేతలు చేస్తున్న ఈ జాబ్ రెన్యువల్ విమర్శలు.. మాత్రం జోరుగా హైలెట్ అవుతున్నాయి. అయితే.. ఈ విమర్శ వెనుక ఏముంది ? అంటే.. సీఎం జగన్ ఉన్నారని వైసీపీలో గుసగుస వినిపిస్తుండడం గమనార్హం.
ఎలా మాట్లాడినా…?
జగన్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే సమయంలో.. ఇప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 90 శాతం మందిని.. తాను రెండున్నరేళ్లలో మార్చేస్తానని ప్రకటించారు. అంటే.. ఇప్పుడున్న వారిలో ఓ నలుగురు మినహా అందరూ మారిపోవడం ఖాయం. సో.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలనే ఆసరా చేసుకుని.. టీడీపీ నాయకులు వైసీపీ మంత్రులపై విమర్శలు చేస్తున్నారు. మంత్రులు ఏ విమర్శలు చేసినా.. “ఆయన మంత్రి పదవి రెన్యువల్ కోసమే.. ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు“ అని విరుచుకుపడుతున్నారు.
జగన్ ఉద్దేశ్యం వేరైనా….?
ఎందుకంటే ఏపీలో జగన్ పాలన ప్రారంభమై త్వరలోనే రెండున్నరేళ్లు పూర్తి కానుంది. దీంతో త్వరలోనే మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులకు సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే మంత్రుల రెండున్నరేళ్ల పనితీరుపై రిపోర్టులు కూడా రెడీ అవుతున్నాయి. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన కామెంట్లను కూడా మాజీ మంత్రి జవహర్ ఇదే కోవలో తీసుకున్నారు. “ఆయన మంత్రి పదవి రెన్యువల్ కోరుకుంటున్నారు“ అందుకే.. ఇలా విమర్శలు చేస్తున్నారు.. అని కామెంట్ చేయడం గమనార్హం. కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నానిపై సైతం ఇదే తరహా విమర్శలు టీడీపీ నుంచి వస్తున్నాయి. మొత్తానికి జగన్ ఏ ఉద్దేశంతో రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులు అవుట్ అన్నారో కాని.. ఇప్పుడు జగన్ వ్యాఖ్యలే వైసీపీ మంత్రులకు ఇబ్బందిగా మారాయని అంటున్నారు పరిశీలకులు.