జగన్ కి విశాఖ షాక్…?
విశాఖ అంటే మోజు అంటూ చెప్పుకునే జగన్ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని విపక్షాలు పదే పదే ఆడిపోసుకుంటాయి. సరే వారిది రాజకీయం అని సరిపెట్టుకున్నా [more]
విశాఖ అంటే మోజు అంటూ చెప్పుకునే జగన్ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని విపక్షాలు పదే పదే ఆడిపోసుకుంటాయి. సరే వారిది రాజకీయం అని సరిపెట్టుకున్నా [more]
విశాఖ అంటే మోజు అంటూ చెప్పుకునే జగన్ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని విపక్షాలు పదే పదే ఆడిపోసుకుంటాయి. సరే వారిది రాజకీయం అని సరిపెట్టుకున్నా కొన్ని విషయాల్లో జగన్ పోతున్న పోకడల పట్ల మేధావులు ప్రజా సంఘాలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అయిదు చోట్ల విలువైన విశాఖ భూములను అమ్మకానికి పెట్టడానికి జగన్ సర్కార్ రెడీ అయిపోయింది. దీన్ని కోర్టు అడ్డుకోవడం పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ భూములు అంటే పార్టీల జాగీరు కాదు అన్న కఠినమైన మాటలను కూడా ఈ సందర్భంగా మేధావులు జగన్ ప్రభుత్వం మీద వాడడం గమనార్హం.
మిగులు భూమి ఏది..?
విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల్లో ప్రభుత్వ భూములు అన్న మాటే లేదు. ఒకపుడు విశాఖ నిండా సర్కార్ జాగాలు పెద్ద ఎత్తున ఉండేవి కాలక్రమంలో వాటిని వివిధ రకాలుగా నాటి పాలకులు విక్రయించారు. అదే విధంగా రాజకీయ పెద్దలు గద్దలుగా మారి కూడా చాలా చోట్ల పాగాలు వేశారు. అలాంటిది ఇపుడు ఉన్న అతి కొద్ది స్థలాల మీద ఏకంగా ప్రభుత్వమే కన్ను వేయడం దారుణం అని మేధావులు అంటున్నారు. వీలు అయితే వాటిని ప్రగతి కొరకు ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవాలి కానీ ఇలా తెగనమ్మడమేంటి అని కూడా విమర్శిస్తున్నారు.
తప్పని చెప్పి మరీ …?
ఇక ఇదే సమయంలో కేంద్రం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తోంది. అక్కడ భూములు కూడా వేల కోట్ల విలువ చేసేవి. మరి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దని చెప్పిన జగన్ సర్కార్ తాను మాత్రం ఇలా ప్రభుత్వ భూములు అమ్మడానికి రెడీ కావడం అంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించడమేనని ప్రొఫెసర్ కె ఎస్ చలం అంటున్నారు. రూల్ ఎవరికైనా ఒక్కటేనని కూడా ఆయన చెబుతున్నారు. ఇక విశాఖలో భూములే లేవు అంటూంటే ఉన్న అరకొర స్థలాలు కూడా అమ్మి పబ్బం గడుపుకుందామనుకుంటే ఎలా అని కూడా ఆయన నిలదీస్తున్నారు. మూడు జిల్లాల్లో భూముల లెక్కలు తీస్తే ఎక్కడా సర్కార్ కి పెద్దగా భూములే లేవు అన్నది గ్రహించాలని కూడా ఆయన కోరుతున్నారు.
తగ్గితేనే మేలు ….
టీడీపీ లూలూ గ్రూప్ కి ఉచితంగా భూములు ఇస్తామని ఒప్పందం చేసుకుంటే నాడు వైసీపీ వ్యతిరేకించింది. ఇపుడు అవే భూములను తాము అమ్మకానికి పెట్టడం మంచిది కాదన్న సూచన ప్రజా సంఘాల నుంచి కూడా వస్తోంది. వామపక్ష నాయకులు అయితే తాము ఆ భూముల్లో ఎర్ర జెండాలు పాతేస్తామని హెచ్చరిస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించి అభివృద్ధి చేయడానికి జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాల మీద ఇప్పటిదాకా మేధావులు ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ వచ్చాయి. ఆ మంచితనాన్ని ఉంచుకోకుండా ఇలాంటి పనులు చేస్తే విశాఖ మళ్లీ అందని పండే అవుతుంది అని కూడా సూచిస్తున్నారు. మొత్తానికి ఇప్పటికైనా జగన్ సర్కార్ ఇటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా వెనక్కి తగ్గితేనే మేలు అన్న మాట అయితే ఉంది.