రూరల్ రాజకీయం అదుర్స్: వైసీపీ-టీడీపీ నువ్వానేనా ?
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి సంస్థాగత ఓటు బ్యాంకు ఉంది. అదేవిధంగా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కూడా మంచి ఓటు బ్యాంకు ఉండేది. అయితే.. కాంగ్రెస్ ఓటు [more]
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి సంస్థాగత ఓటు బ్యాంకు ఉంది. అదేవిధంగా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కూడా మంచి ఓటు బ్యాంకు ఉండేది. అయితే.. కాంగ్రెస్ ఓటు [more]
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి సంస్థాగత ఓటు బ్యాంకు ఉంది. అదేవిధంగా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కూడా మంచి ఓటు బ్యాంకు ఉండేది. అయితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా వైఎస్ తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ వైపు మళ్లిపోయింది. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి.. టీడీపీ ఓటు బ్యాంకును కూడా పూర్తిగా తమవైపు తిప్పుకోవాలనేది జగన్ ప్రయత్నం. ఇటీవల ఆయన ఈ ప్రయత్నాలను కూడా పెంచారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి మరింతగా ఈ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జగన్ బలమే గ్రామీణ ఓటు బ్యాంకు. గత సాధారణ ఎన్నికల్లో పల్లె ప్రాంతాలు అన్నీ వన్‌సైడ్‌గా వైసీపీకి పట్టం కట్టాయి.
గ్రామీణ ప్రాంతాల్లో…..
అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణాల్లో వైసీపీకి అనుకున్న స్థాయిలో ఓటింగ్ రాలేదు. అయితే అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక పథకాలు ద్వారా పట్టణ ఓటు బ్యాంకును కూడా జగన్ సుస్థిరం చేసుకున్నట్టు ఇటీవల పురపోరు ఫలితాలు చెప్పేశాయి. ఇక వచ్చే ఎన్నికల్లో పూర్తిగా గ్రామీణ ప్రాంత ఓటు బ్యాంకును వన్‌సైడ్ చేసేందుకు జగన్ ఇప్పటి నుంచే ప్లానింగ్‌తో వెళుతున్నారు. దీనికి గాను జగన్ ఎంచుకున్న ఏకైక మాత్రం రైతు భరోసా కేంద్రాలు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి.
రైతు కమ్యునిటీని….
రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని బలోపేతం చేయడం ద్వారా, రైతులకు అన్ని విధాలా మేళ్లు చేయడం ద్వారా ముందుకు సాగాలని జగన్ సంకల్పించినట్టే తెలుస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక పోయినా.. ఆయన రైతులకు ఇవ్వాల్సిన రుణాలు, ఇతరత్రా ఆర్థిక సాయం విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. దీంతో గ్రామీణ ప్రాతాల్లో వైసీపీ పుంజుకుంటోందని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఇదే విషయంపై కన్నేసిన టీడీపీ తన సంస్థాగత ఓటు బ్యాంకును పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
బాబు కూడా…?
ఈ దఫా కమిటీల్లో గ్రామీణ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని .. ఇప్పటికే సీనియర్ల నుంచి చంద్రబాబుకు సలహాలు వచ్చాయి. ఆయన కూడా పంచాయతీలో జరిగిన పరాభవాల నేపథ్యంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే.. ఇప్పుడే కాకపోయినా… వచ్చే ఏడాది నాటికి మార్పులు తథ్యమని తెలుస్తోంది. అయితే.. అప్పటికే జగన్ కనుక విస్తరిస్తే.. మనం ఏం చేసినా.. ప్రయోజనం ఉండదని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య నువ్వా-నేనా అనే తరహా వాతావరణం ఉందని అంటున్నారు. మరి చంద్రబాబు చేసేదేదో.. త్వరగా చేస్తే బెటర్ అంటున్నారు పరిశీలకులు.