మోడీ మిత్రులతో జగన్ స్నేహం.. రీజనేంటి ?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని.. ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం అంచనాల పెంపు, దిశా చట్టం అమలు.. వంటి కీలక విషయాల్లో.. కేంద్రం [more]
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని.. ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం అంచనాల పెంపు, దిశా చట్టం అమలు.. వంటి కీలక విషయాల్లో.. కేంద్రం [more]
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని.. ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం అంచనాల పెంపు, దిశా చట్టం అమలు.. వంటి కీలక విషయాల్లో.. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మదన పడుతున్నారు. తాము చెప్పిన మాటలను కేంద్రంలోని ప్రభుత్వం అస్సలు వినిపించుకోవడం లేదని ఎంపీలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో కేంద్రానికి – ఏపీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతోందని అనుకునేవారు ఎక్కువగా ఉన్నారు. అంటే.. కేంద్రంలోని బీజేపీతో జగన్ సర్కారుకు చెడుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మూడు విషయాల్లో….
కానీ, ఇదే సమయంలో బీజేపీ సహకరించడం లేదని చెబుతూనే.. బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ స్నేహం చేయడం.. ఆయన చెప్పినట్టు వినడం.. ఆయన చెప్పినట్టు చేయడం వంటివి రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మూడు విషయాల్లో జగన్ తీసుకున్న నిర్ణయాలు.. ఆయనకు.. ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య సంబంధాలను స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. వీటిలో ప్రధానంగా రాజ్యసభ టికెట్‌ను మోడీ, అమిత్ షా ఉమ్మడి మిత్రుడు.. ప్రముఖ వ్యాపార వేత్త.. ముకేష్ అంబానీ మిత్రుడైన.. నత్వానీకి కేటాయించారు.
అన్నీ ఆయన మిత్రులకే….
వాస్తవానికి రాష్ట్రంలో అనేక మంది వైసీపీ నాయకులు రాజ్యసభ టికెట్‌ను ఆశించారు.కానీ, జగన్ మాత్రం మోడీ మిత్రుడికి కేటాయించారు. ఇక, మోడీకి మరో మిత్రుడు.. గుజరాత్ వ్యాపార దిగ్గజం.. ఆదానీకి ఏపీలోని పోర్టులను ధారాదత్తం చేయడం. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును పూర్తిగా ఆదానీ సంస్థలు దక్కించుకున్నాయి. ఇక, మూడో విషయం.. గుజరాత్‌కే చెందిన మోడీకి ఎంతో ఇష్టమైన.. అమూల్ పాల సంస్థకు ఏపీలో స్థానం కల్పించారు. అంతేకాదు.. అమూల్ కోసం.. స్థానిక పాల డెయిరీలను కూడా తొక్కేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అనేక బిల్లులకు సంబంధించి…..
ఇక.. ఇతర బిల్లులకు సంబంధించి.. పార్లమెంటులోనూ మోడీకి జై కొడుతున్నారు. ఇలా.. మోడీతో జగన్ స్నేహం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు చేయనప్పుడు.. మోడీతో జగన్ స్నేహం ఎందుకు? అనేది కీలక ప్రశ్న. వ్యక్తిగత లబ్ధి చూసుకుంటున్నారా? అనే సందేహం వస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయంపై వైసీపీ నేతలు చాలా గుంభనంగా ఉండడం గమనార్హం.