మహిళలకు మరింత క్లోజ్.. టీడీపీలో లోపమేనా ?
ఎన్నికల్లో మహిళలకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పురుష ఓటర్ల కంటే కూడా మహిళల ఓటు బ్యాంకు రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అంతేకాదు.. రాష్ట్రంలో పురుష [more]
ఎన్నికల్లో మహిళలకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పురుష ఓటర్ల కంటే కూడా మహిళల ఓటు బ్యాంకు రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అంతేకాదు.. రాష్ట్రంలో పురుష [more]
ఎన్నికల్లో మహిళలకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పురుష ఓటర్ల కంటే కూడా మహిళల ఓటు బ్యాంకు రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అంతేకాదు.. రాష్ట్రంలో పురుష ఓటర్లకంటే.. ముందుగానే మహిళలు ఓటు వేసేందుకు లైన్లోకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా.. రాజకీయంగా మహిళలను టార్గెట్ చేసుకుంటాయి. ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్.. తన సర్కారు ఏర్పాటైన తర్వాత.. ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలను మహిళలకు కేంద్రంగా మార్చారు. ఒక డిప్యూటీ సీఎం సహా.. హోం శాఖను కూడా మహిళకే ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో….
ఇక, ఇటీవల ముగిసిన మునిసిపల్.. ఎన్నికల్లోనూ, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మహిళలకు అవకాశం కల్పించారు. దీంతో తనది మహిళా పక్షపాత ప్రభుత్వమని ఆయన పదే పదే చెప్పుకొంటున్నారు. విచిత్రం ఏంటంటే జనరల్ సీటుగా ఉన్న విజయవాడ మేయర్ పదవిలో బీసీ మహిళకు ఛాన్స్ ఇచ్చిన జగన్.. బీసీ జనరల్‌గా ఉన్న వైజాగ్ మేయర్‌ను బీసీ మహిళకు ఇచ్చారు. ఈ నిర్ణయాలు రాజకీయాల్లోనే పెద్ద సంచలనాలు అయ్యాయి. అదే సమయంలో మహిళల కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛన్లు ఇస్తున్నారు.
అనేక రూపాల్లో…..
ఇలా.. అనేక రూపాల్లో మహిళలకు జగన్ సర్కారు చేరువ అయిందనడంలో సందేహం లేదు. ఇక, తాజాగా ఇప్పుడు మహిళ లకు బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీని కూడా జమ చేశారు. అయితే.. ఇది పాతదే అయినప్పటికీ.. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. గత చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా వదిలేసిన డబ్బును కూడా ఇప్పుడు జగన్ జమ చేయడం. సో.. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తున్న టీడీపీ నేతలు.. “అరరే మనం తప్పుచేశాం“ అని నాలిక కొరు క్కుంటున్నారు. మహిళల కోసం.. చంద్రబాబు హయాంలో ప్రత్యేకం రూపొందించిన పథకాలు లేవు. అదే విధంగా మంత్రి వర్గంలోనూ ముగ్గురికి అవకాశం ఇచ్చినా.. ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారనే ప్రచారం జరిగింది.
వ్యూహాత్మకంగానే….?
ఇక, ఎన్నికల సమయంలో పసుపు-కుంకుమ వంటివి ఇచ్చినా.. వాటిని కొందరికే పరిమితం చేయడం.. సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ చేయకపోవడం.. పైగా.. ఇచ్చిన పది వేల రూపాయలను కూడా ఒకే సారి ఇవ్వకుండా విడతల వారీగా .. ఇవ్వడం వంటివి మహిళా ఓటు బ్యాంకుకు తీవ్ర విఘాతం కలిగించాయి. ఈ నేపథ్యంలోనే మహిళా ఓటు బ్యాంకు టీడీపీ వైపు నిలబడలేక పోయిందని అంటున్నారు పరిశీలకులు ఇదే విషయంలో జగన్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఫలిస్తున్నాయని చెబుతున్నారు.