ఆశావహులకు జగన్ మార్క్ భారీ షాక్ ?
జగన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయరు అన్నది తెలిసిందే. ఆయన అంతా కొత్తగా ఆలోచిస్తారు కొత్త బాటలో వెళ్తారు. అలాగే ఆయన అనేక సంచలన నిర్ణయాలను గత పదేళ్ల [more]
జగన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయరు అన్నది తెలిసిందే. ఆయన అంతా కొత్తగా ఆలోచిస్తారు కొత్త బాటలో వెళ్తారు. అలాగే ఆయన అనేక సంచలన నిర్ణయాలను గత పదేళ్ల [more]
జగన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయరు అన్నది తెలిసిందే. ఆయన అంతా కొత్తగా ఆలోచిస్తారు కొత్త బాటలో వెళ్తారు. అలాగే ఆయన అనేక సంచలన నిర్ణయాలను గత పదేళ్ల పొలిటికల్ కెరీర్ లో తీసుకున్నారు. ఇదిలా ఉంటే జగన్ సర్కార్ కి రెండేళ్ళు నిండి మూడవ ఏట అడుగుపెడుతోంది. అదే సమయంలో మరో ఆరు నెలలు ఆగితే మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అని కూడా వైసీపీలో ఆశావహులు భావిస్తున్నారు. కానీ జగన్ మదిలో ఆలోచనలు ఏంటి అన్నవి ఎవరికీ తెలియడంలేదు. దాంతో రకరకాలుగా ప్రచారం కూడా సాగుతోందిపుడు.
వారికి నో ఛాన్స్….
ఏపీలో జగన్ పాతిక మంది మంత్రులతో 2019లో తన మంత్రివర్గాన్ని నిర్మించారు. అందులో బడుగు, బలహీన వర్గాల సామాజికవర్గాలకు పెద్ద పీట వేశారు. అలగే అయిదుగురుకి ఉప ముఖ్యమంత్రులుగా పదవులు ఇచ్చారు. ఇక కొత్తగా విస్తరణ చేపడితే ఆ కూర్పు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాగే కేవలం పాతిక మందికే మంత్రులుగా చోటు దక్కింది. దాంతో మిగిలిన 125 మందీ ఆశావహులుగానే ఉన్నారనుకోవాలి. విస్తరణ పేరిట కెలికితే వారంతా రెక్కలు విప్పుతారు అన్న ఆలోచన కూడా జగన్ కి ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ అసలు మంత్రివర్గ విస్తరణ చేపట్టరు అంటూ మరో వైపు ప్రచారం సాగుతోంది. అంటే ఉన్న వారితోనే కధ సాగుతుంది అంటున్నారుట.
నీళ్లు చల్లుడే…?
ఇదే కనుక నిజమైతే కొత్తగా కుర్చీలు ఎక్కాలనుకునేవారికి మాత్రం తీవ్ర నిరాశే అని చెప్పాలి. వారి ఆశలపైన జగన్ కుండెడు నీళ్ళు పోశారని కూడా భావించాలి. రాబోయే కాలానికి కాబోయే మంత్రులం తామేనని కూడా ఇప్పటి నుంచే చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు. వారంతా కూడా బాగా నీరసపడిపోతారు. మరి జగన్ స్వయంగా అప్పట్లో రెండున్నరేళ్లకు మాత్రమే ఈ మంత్రిమండలి ఉంటుంది అని చెప్పి కూడా ఇపుడు చేయకపోతే తప్పు కాదా అన్న చర్చ కూడా ఉంది. కానీ అక్కడ ఉన్నది జగన్. ఆయన నిర్ణయాలను ఎవరూ కనీసంగా కూడా ప్రశ్నించజాలరు అన్నది మాత్రం నిజం.
పక్కా వ్యూహంతో …?
నిజానికి జగన్ మంత్రి వర్గం విస్తరణ చేస్తాను అని నాడు చెప్పడమూ ఒక వ్యూహమే. ఇపుడు చేపట్టకపోయినా కూడా అది వ్యూహమే. ఇక నాడు పెద్ద ఎత్తున ఆశావహులు ఉన్నారు. అందులో తనకు నచ్చిన వారిని మంత్రులుగా జగన్ చేసుకున్నారు. నాడు అసంతృప్తి వెల్లువలా వ్యాపిస్తుంది అని భావించిన వేళ తెలివిగా జగన్ అడ్డుకట్ట వేశారు అంటున్నారు. అందుకే ఆయన హాఫ్ టైమ్ క్యాబినెట్ అంటూ కొత్త ఆశలను ఆశావహుల్లో రేపారు అంటున్నారు. ఇక ఇపుడు చూస్తే మంత్రుల్లో ఎవరి మీద తీవ్రమైన ఆరోపణలు లేవు. పైగా సాఫీగా తాపీగా కధ సాగుతోంది. ఈ టైమ్ లో మొత్తం మంత్రివర్గాన్ని మారిస్తే కొత్త వారందరికీ చాన్స్ ఎలాగూ దక్కదు. అపుడు తీసేసిన వారూ మిగిలిపోయిన వారూ కలస్తే పెద్ద ఎత్తున అసంతృప్తి వస్తుంది. అలా కాకుండా అసలు బాలేదు అనుకున్న ఒకరిద్దరిని తప్పించడమో లేక ఇదే మంత్రివర్గంతో వచ్చే ఎన్నికలకు వెళ్ళడమో ఏదో ఒకటి చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి జగన్ ఈ రకంగా కనుక సంచలన నిర్ణయం తీసుకుంటే ఆశావహులకు భారీ షాక్ తగలడం ఖాయమే అంటున్నారు.