అలా నిజం చెప్పేస్తే ఎలా?
జగన్ అందుకే చాలా మందికి చెడ్డ అవుతున్నారు. పైగా ఆయన చెప్పిన తరువాత కూడా వెటకారాలు ఈసడింపులూ కూడా ఎక్కువ అవుతున్నాయి. అయినా జగన్ దేనికీ వెరిచే [more]
జగన్ అందుకే చాలా మందికి చెడ్డ అవుతున్నారు. పైగా ఆయన చెప్పిన తరువాత కూడా వెటకారాలు ఈసడింపులూ కూడా ఎక్కువ అవుతున్నాయి. అయినా జగన్ దేనికీ వెరిచే [more]
జగన్ అందుకే చాలా మందికి చెడ్డ అవుతున్నారు. పైగా ఆయన చెప్పిన తరువాత కూడా వెటకారాలు ఈసడింపులూ కూడా ఎక్కువ అవుతున్నాయి. అయినా జగన్ దేనికీ వెరిచే మనిషి కాడు. అది ఆయన టోటల్ రాజకీయ జీవితంలోనే లేదు. ఇక జగన్ దగ్గర ఎపుడూ ఒక కుండ ఉంటుంది. దాన్ని ఆయన సమయానుకూలంగా బద్ధలు కొట్టేస్తారు. ఆ శబ్దం భయంకరం. దాంతో జనాలతో పాటు విన్నవారంతా జడుసుకుంటారు. ఆనక సత్యం తెలుసుకుని జగన్ భలే చెప్పాడు అని కూడా అంటారు.
పక్కా క్లారిటీగా…?
ఇక జగన్ మరో మారు కుండబద్ధలు కొట్టేసారు. అదేంటి అంటే అందరికీ టీకాలు ఇప్పట్లో ఇవ్వడం సాధ్యపడదు అన్నది. నిజానికి ఈ దేశంలో టీకాల ఉత్పత్తి చాలా తక్కువగా సాగుతోంది. రెండు డోసుల టీకాలు వేసుకున్నవారు ఇప్పటికీ రెండున్నర కోట్లు మాత్రమే ఉన్నారు. అర్హులైన 94 కోట్ల మందిలో వీరి సంఖ్య అత్యల్పం. మరి ఆ సంగతి తెలిసి కూడా కేంద్రం ఆర్భాటంగా మే 1 నుంచి 18 ఏళ్ళు దాటిన వారందరికీ టీకాలు అని చెప్పేసింది. ఆ మీదట రాష్ట్రాలే వీటిని ఇస్తాయంటూ భారం, బాధ్యత వారి మీదకు తోసేసింది. దాంతో జగన్ సర్కార్ మే నెలలో టీకాలు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. ఇక తాజాగా జగన్ అయితే సెప్టెంబర్ వరకూ 18 ఏళ్ల పైబడిన వారికి టీకాల ఊసే ఉండదు అని సత్యం చెప్పేశారు.
ఇదీ సీన్…..
జగన్ చెప్పిన ప్రకారం చూస్తే నిజమే అన్నది ఎవరికైనా బోధపడుతుంది. ఈ దేశంలో ప్రతీ నెలా ఇప్పటికైతే ఆరేడు కోట్ల టీకాలు మాత్రమే తయారు అవుతున్నాయి. ఆగస్ట్ నాటికి అది మూడింతలు అయినా ఇరవైకోట్లు మాత్రమే అవుతుంది. ఇక దేశంలో 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ల వయసు కల్గిన వారి 60 కోట్ల మంది ఉన్నారు. వారికి రెండు దఫాల టీకా అంటే 120 కోట్లు అవుతుంది. మరి ఇంత పెద్ద నంబర్ ఉంటే అతి తక్కువ టీకాలతో ఎంతమందికి సర్దుతారు. ఇదే జగన్ బయటపెట్టేశారు. అందువల్ల ఆది నిష్టూరానికే ఆయన సిధ్ధపడ్డారు. ఇపుడు 45 ఏళ్ళు పైబడిన వారికే టీకాలు సరిపోవడంలేదు. వారిలో కూడా చాలా పెద్ద ఎత్తున జనాలు మిగిలిపోయారు. ఈ నేపధ్యంలో కొత్త వారికి ఇవ్వడం కుదరని పని ముందే చేతులు కడిగేసుకున్నారు.
బోల్డ్ గానే …?
జగన్ స్టేట్మెంట్ బోల్డ్ గా ఉంది. మిగిలిన ముఖ్యమంత్రులు కేంద్రం ఇస్తే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కొందరు మేము స్టార్ట్ చేస్తామని బీరాలు కూడా పలుకుతున్నరు. ఎవరు ఇవ్వాలన్నా కూడా ఇప్పట్లో కుదిరేది కాదు అన్నది కఠిన సత్యం. జగన్ కూడా ఇదే విషయం చెప్పారు. పైగా అందరికీ వ్యాక్సినేషన్ అంటే కచ్చితంగా వచ్చే ఏడాది దాటుతుంది అని కూడా ఉన్న మాటనే చెప్పేశారు. అప్పటిదాకా అంతా కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడమే అని కూడా జగన్ వివరించారు. గత ఏడాది కూడా కరోనాతో సహజీవనం తప్పదు అని జగన్ అంటే చంద్రబాబు సహా ఏపీలోని విపక్షాలు గట్టిగా తగులుకున్నాయి. కానీ చివరికి అదే నిజం అయింది. ఇపుడు కూడా జగన్ కరోనా ఇప్పట్లో పోదు, టీకాలు కూడా వేయలేమంటూ గట్టిగానే చెప్పేశారు. మరి ఇదే మేలు కూడా. ఉన్న మాట అంటే ఉలుకే కానీ చివరికి అంతా సత్యమే తెలుసుకుంటారు కూడా.