ఆ మూడూ ఇప్పుడు లేనట్టే.. జగన్కు ఆ ఎఫెక్ట్
సీఎం జగన్కు కరోనా ఎఫెక్ట్ బాగానే తగిలేటట్టు ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో మూడు ముఖ్యమైన ప్రాజెక్టులపై కరోనా ప్రభావం పడుతోందని.. ఇప్పట్లో వీటిపై జగన్ నిర్ణయం [more]
సీఎం జగన్కు కరోనా ఎఫెక్ట్ బాగానే తగిలేటట్టు ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో మూడు ముఖ్యమైన ప్రాజెక్టులపై కరోనా ప్రభావం పడుతోందని.. ఇప్పట్లో వీటిపై జగన్ నిర్ణయం [more]
సీఎం జగన్కు కరోనా ఎఫెక్ట్ బాగానే తగిలేటట్టు ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో మూడు ముఖ్యమైన ప్రాజెక్టులపై కరోనా ప్రభావం పడుతోందని.. ఇప్పట్లో వీటిపై జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ మూడు నిర్ణయాల్లో ఒకటి మూడు రాజధానుల ఏర్పాటు, కొత్త జిల్లాల ఏర్పాటు, పరిషత్ ఫలితం. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
మూడు రాజధానులు: ప్రస్తుతం ఉన్న అంచనాలు, లెక్కల ప్రకారం.. మే 16న విశాఖలో పాలన రాజధాని ఏర్పాటు కావాలి. ఈ క్రమంలో దీనికి సంబంధించిన చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టింది. అయితే.. కోర్టులో కేసులు ఉన్నప్పటికీ.. ముందుకు సాగినా.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఇది ఇప్పట్లో ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. అదే సమయంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ముందుకు సాగితే.. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
కొత్త జిల్లాలు: ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించినా.. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చాయి. మరో రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఏర్పాటు చేసే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. కానీ, ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితి లేకుండా పోతోంది. కరోనా నేపథ్యంలో కేంద్రం జనాభా లెక్కల సమయాన్ని వచ్చే ఏడాదికి పొడిగిస్తూ.. తాజాగా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీలో జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో లేనట్టేనంటున్నారు.
పరిషత్ ఫలితం: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు పూర్తయినా.. ఫలితం మాత్రం రాలేదు. దీనిపై వైసీపీ నాయకులు, సీఎం జగన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ ఫలితం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉండడమే. సో..ఇది కూడా ఇప్పట్లో తేలేలాలేదని చెబుతున్నారు. జగన్ పరిషత్ ఫలితాల విషయంలో ఎంత తొందరగా ఉంటే .. ఇక్కడ అంత ఆలస్యం అవుతోంది. మొత్తానికి కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అత్యంత కీలకమైన మూడు విషయాల్లో అడుగులు ముందుకు పడే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.