వారిని నమ్ముకుంటే ముంచేయడం గ్యారంటీ అట.?
సంతృప్తస్థాయి ప్రభుత్వం పై ప్రజల్లో ఎంత ఉందనేది తేల్చిది ప్రజలు. ఇవి ఎన్నికల ద్వారా తెలిసిపోతుంది. అయితే ముఖ్యమంత్రులకు మాత్రం సంతృప్త స్థాయిని తెలియజేసేది అధికారులు. గతంలో [more]
సంతృప్తస్థాయి ప్రభుత్వం పై ప్రజల్లో ఎంత ఉందనేది తేల్చిది ప్రజలు. ఇవి ఎన్నికల ద్వారా తెలిసిపోతుంది. అయితే ముఖ్యమంత్రులకు మాత్రం సంతృప్త స్థాయిని తెలియజేసేది అధికారులు. గతంలో [more]
సంతృప్తస్థాయి ప్రభుత్వం పై ప్రజల్లో ఎంత ఉందనేది తేల్చిది ప్రజలు. ఇవి ఎన్నికల ద్వారా తెలిసిపోతుంది. అయితే ముఖ్యమంత్రులకు మాత్రం సంతృప్త స్థాయిని తెలియజేసేది అధికారులు. గతంలో చంద్రబాబు ఉన్నా, ఇప్పుడు జగన్ ఉన్నా వారే కీలకం. ఒకరకంగా ముఖ్యమంత్రులు అధికారులపై ఆధారపడక తప్పదు. తాము అనుకున్న పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు జరగాలంటే అధికారులే కీలకం. అందుకే అధికారులకు అంత ప్రయారిటీ ఇస్తారు. కాని ముంచేది కూడా వారేనన్నది గ్రహించాల్సి ఉంటుంది.
ఎన్నికల ద్వారానే..?
సహజంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనేది ఎన్నికల ద్వారానే తెలుస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో ఎక్కువ శాతం జగన్ పార్టీ ఓట్లు సాధించింది. అయితే ఇప్పటి వరకూ జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనలు జరపలేదు. కేవలం సీఎం క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. అధికారులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తోనే ఆయన పాలన సాగిస్తున్నారు.
అధికారుల ఫీడ్ బ్యాక్….
అధికారుల పనితీరు ఎలాగా ఉంటుందంటే.. ఇటీవల ఆక్సిజన్ నిల్వలపై జగన్ నిత్యం సమీక్షలు నిర్వహించేవారు. నిల్వలకేం ఢోకాలేదని అధికారులు బిల్డప్ ఇచ్చేవారు. దీంతోజగన్ అది నిజమని నమ్మేవారు. కానీ ఆక్సిజన్ కొరతతో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కాని జగన్ కు తెలియలేదు తనకు రాంగ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఇక వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫీడ్ బ్యాక్ రాదన్న గ్యారంటీ ఏమీ లేదు.
బాబు కూడా సేమ్…..
గతంలో చంద్రబాబు కూడా సంతృప్త స్థాయి అంటూ అధికారుల మీదనే ఆధారపడ్డారు. ఎమ్మెల్యేలను దూరం పెట్టారు. జగన్ కూడా అదే బాటలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో కరోనా కాని, ఇతర సమస్యలపై కాని అసలైన, సిసలైన నివేదికలు రావాలంటే అది ప్రజాప్రతినిధుల ద్వారానే సాధ్యమవుతుంది. అధికారులు ఏమీ జగన్ దీర్ఘకాలం పదవిలో ఉండాలని కోరుకోరు. ఇప్పటికైనా జగన్ గమనించి అధికారులను ఎంతవరకూ ఉంచాలో అంతవరకూ ఉంచి, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో టచ్ లో ఉంటే తప్ప వాస్తవ విషయాలు తెలియవు.