పీఎంవో ఆఫీస్ రిక్వెస్ట్ చేసిందా?
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పీఎంవో నుంచి ఇటీవల ఫోన్ కాల్ రావడం చర్చనీయాంశమైంది. మోదీ కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ ఒకింత జగన్ వత్తిడికి [more]
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పీఎంవో నుంచి ఇటీవల ఫోన్ కాల్ రావడం చర్చనీయాంశమైంది. మోదీ కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ ఒకింత జగన్ వత్తిడికి [more]
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పీఎంవో నుంచి ఇటీవల ఫోన్ కాల్ రావడం చర్చనీయాంశమైంది. మోదీ కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ ఒకింత జగన్ వత్తిడికి గురయ్యారంటున్నారు. పీఎంవో నుంచి జగన్ కు నేరుగా కాల్ రావడానికి కారణమేంటి? దీనిపై జగన్ వత్తిడి ఎదుర్కొనడమేంటి? అన్న సందేహాలు అందరికీ వస్తాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం మోదీ కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ తోనే జగన్ ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చిందంటున్నారు.
సోరెన్ వ్యాఖ్యలపై…?
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో కరోనా వైరస్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని తాను చెప్పేదే వినాలనుకుంటారని, మేము చెప్పేది వినరని ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనిపై కౌంటర్ ఇవ్వాలని జగన్ కు పీఎంవో కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిసింది.
బీజేపీ సీఎంలు ఉన్నా…?
హేమంత్ సోరెన్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలే కౌంటర్ ఇచ్చే వీలుంది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు హేమంత్ సోరెన్ కు గట్టిగా కౌంటర్ ఇవ్వవచ్చు. కానీ ప్రధాని మోదీ మాత్రం బీజేపీయేతర ముఖ్యమంత్రులే హేమంత్ సోరెన్ వ్యాఖ్యలను ఖండించాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పీఎంవో అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. దేశం మొత్తం మీద చూసుకుంటే సోరెన్ వ్యాఖ్యలు కౌంటర్ ఇవ్వగలిగింది జగన్ ఒక్కరేనని గుర్తించారు.
మోదీ సెలక్షన్ అట….
అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీల ముఖ్యమంత్రులుగా ఉన్నా వారిపై మోదీకి నమ్మకం లేదు. తమకు ఒకింత నమ్మకంగా, విశ్వసనీయంగా ఉన్న జగన్ అయితే బెటర్ అని మోదీ భావించారట. దీంతో పీఎంవో కార్యాలయం జగన్ ను సంప్రదించినట్లు చెబుతున్నారు. ఒక ట్వీట్ చేయాలని కోరినట్లు తెలిసింది. జగన్ తొలుత కొంత సందిగ్దత వ్యక్తం చేసినా పీఎంవో అధికారులు మోదీ చెప్పారని చెప్పడంతో జగన్ సోరెన్ వ్యాఖ్యలను ఖండించినట్లు తెలిసింది. మొత్తం మీద మోదీకి దేశంలోనే జగన్ ను మించిన నమ్మకస్థుడు లేడన్న కామెంట్స్ పార్టీలోనూ వినపడుతున్నాయి.