జగన్ ప్రభుత్వాన్ని పడగొడతారా… ?
జగన్ సర్కార్ మ్యాజిక్ ఫిగర్ కి అటూ ఇటూ నంబర్ల మధ్యన ఊగిసలాడుతూ అధికారం నెట్టుకొస్తున్న దుస్థితిలో లేదు. ఏకంగా 151 సీట్లతో అధికారం హస్తగతం చేసుకుంది [more]
జగన్ సర్కార్ మ్యాజిక్ ఫిగర్ కి అటూ ఇటూ నంబర్ల మధ్యన ఊగిసలాడుతూ అధికారం నెట్టుకొస్తున్న దుస్థితిలో లేదు. ఏకంగా 151 సీట్లతో అధికారం హస్తగతం చేసుకుంది [more]
జగన్ సర్కార్ మ్యాజిక్ ఫిగర్ కి అటూ ఇటూ నంబర్ల మధ్యన ఊగిసలాడుతూ అధికారం నెట్టుకొస్తున్న దుస్థితిలో లేదు. ఏకంగా 151 సీట్లతో అధికారం హస్తగతం చేసుకుంది వైసీపీ. అంతేకాదు టీడీపీ నుంచి కూడా కొందరి ఎమ్మెల్యేల మద్దతు ఎటూ ఉంది. ఏకైక జనసేన ఎమ్మెల్యే కూడా ఏనాటి నుంచో జగన్ కి జై కొడుతూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పుకుంటే ప్రస్తుతం అసెంబ్లీ అంతా జగన్ దే అనుకోవాలి. విపక్షానికి నామమాత్రం బలం కూడా లేదు. అలాంటపుడు పదే పదే తమ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారు అంటూ వైసీపీ నేతలు ఎందుకు బేలగా మాట్లాడుతున్నారు.
నాడూ అలాగే …?
న్యాయ వ్యవస్థతో కూడా వైసీపీ ఒక సందర్భంలో పేచీ పెట్టుకుంది. అప్పట్లో వరసపెట్టి కోర్టు తీర్పులు జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా వస్తూండేవి. దాంతో ఏకంగా నాటి సుప్రీం కోర్టు సీనియర్ న్యాయ మూర్తి మీదనే జగన్ లేఖాస్త్రం సంధించారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర సాగుతోందని కూడా ఆనాడే ఆయన పేర్కొన్నారు. దాని కధ ఏమైనా కూడా ఇక ఏపీలో విపక్షాల తీరు కూడా శాసన సభలో ప్రాతినిధ్యమే లేదు. మరో వైపు రాజ్యాంగ వ్యవస్థలు వాటి పని అవి చేస్తాయి. అయినా కానీ తమ ప్రభుత్వం కూల్చేస్తారు అంటూ ఎందుకు వైసీపీ యాగీ చేస్తోందో తెలియని పరిస్థితే.
బాబుకు సాధ్యమా ..?
రఘురామ క్రిష్ణం రాజు అనే రెబెల్ ఎంపీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తమ ప్రభుత్వాని అస్థిరపరుస్తున్నారు అన్నది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. తమ ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో ఎదుర్కోనలేకనే బాబు ఇలా వ్యవహరిస్తున్నారు అంటున్నారు సజ్జల రామక్రిష్ణారెడ్డి. నిజానికి రెబెల్ ఎంపీ రఘురామ మాటలను ఎవరూ అసలు పట్టించుకోరు. ఆయన అసభ్య పదజాలాన్ని చూసి ఆయన మీదనే వ్యతిరేకత పెంచుకుంటారు. ఇక ఆయనతో జగన్ సర్కార్ మీద ఆరోపణలు చంద్రబాబు చేయించినంతమాత్రాన బలమైన వైసీపీ సర్కార్ కి వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా ఈ విషయంలో జగన్ కి వ్యతిరేకంగా తెగిస్తుంది అని ఎవరూ అనుకోరు. మరి ఎందుకు అలా సజ్జల రామక్రిష్ణా రెడ్డి చంద్రబాబు మీద ఆరోపిస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న.
అసలు కధ అదే …?
ఏడాదిగా రఘురామ జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా కూడా వైసీపీ పెద్దలు చలించలేదు. కానీ జగన్ బెయిల్ ని రద్దు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేయడంతోనే కధ మొత్తం మారిపోయింది. సరిగ్గా ఇక్కడే వైసీపీ చేస్తున్న ఆరోపణలను అర్ధం చేసుకోవాలి. జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడం అంటే ఇదే అనుకోవాలి. జగన్ బెయిల్ రద్దు విషయాన్ని కెలికి ఆయన్ని జైలుకు పంపిస్తే వైసీపీ సర్కార్ కుప్ప కూలుతుంది. ఆటోమేటిక్ గా గొడవలు వస్తాయి. అది రాష్ట్రపతి పాలనకు దారి తీసి మధ్యంతర ఎన్నికలకు కూడా అవకాశం ఏర్పడేలా సీన్ సాగుతుంది. సరే అదే జరిగింది అనుకుంటే మాత్రం జగన్ మీద వెల్లువలా సానుభూతి ఉప్పొంగదా. ఆయన జైలులో ఉన్నా కూడా జనం గెలిపించుకోరా. మొత్తానికి చంద్రబాబు ఒక రాజకీయ నేతగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. అయితే ఒక రాజకీయ పార్టీగా వైసీపీ వాటిని ఎండగట్టడమే కాదు, జనంలో బాబు కుట్రలను ఇలా బయటపెడుతుంది అనుకోవాలి. అసలే మామకు వెన్ను పోటు పొడిచాడు అన్న ఒక విమర్శతో ఉన్న బాబు మీద ఇలాంటి బండలు వేస్తే జనం నమ్మడం కూడా సులువే. మొత్తానికి ఏపీలో సర్కార్ ని కూలగొడతారు అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి.