సీఎం గా సక్సెస్… వైసీపీ అధినేతగా… ?
జగన్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. సినిమాల్లో అయితే ద్విపాత్రాభినయం ఒక కమర్షియల్ ఎలిమెంట్. ఒక హీరోవే రెండు పాత్రలతో ఇద్దరు భామలతో కనిపిస్తే ఫ్యాన్స్ కి ఆ [more]
జగన్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. సినిమాల్లో అయితే ద్విపాత్రాభినయం ఒక కమర్షియల్ ఎలిమెంట్. ఒక హీరోవే రెండు పాత్రలతో ఇద్దరు భామలతో కనిపిస్తే ఫ్యాన్స్ కి ఆ [more]
జగన్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. సినిమాల్లో అయితే ద్విపాత్రాభినయం ఒక కమర్షియల్ ఎలిమెంట్. ఒక హీరోవే రెండు పాత్రలతో ఇద్దరు భామలతో కనిపిస్తే ఫ్యాన్స్ కి ఆ కిక్కే వేరు. కానీ రాజకీయాల్లో మాత్రం అది రెండు పడవల ప్రయాణంతో సమానమే. ఒక వైపు పాలన చూసుకుంటూ మరో వైపు పార్టీని చక్కదిద్దడం అంటే అసలు కుదిరే పని కాదు. అందుకే జగన్ సీఎం గా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వైసీపీ అధినేతగా పాస్ మార్కులు కూడా తెచ్చుకుంటున్నారా అన్నదే ప్రశ్న.
ఎందరు రాజులో…?
ఒక రెబెల్ బయటకు వచ్చాడు. ఆయన ఏకంగా అధినేత జగన్నే ఢీ కొట్టాడు. జగన్ పలుకుబడితో పాటు పార్టీ పరువుని కూడా పూర్తిగా పలుచన చేశాడు. ఇంతా చేసిన తరువాత కూడా ఆయన సర్కార్ వారి యాక్షన్ కి తన రియాక్షన్ ఏంటో చూపించి మరీ నైస్ గా తప్పుకున్నాడు. రఘురామ క్రిష్ణం రాజు ఎపిసోడ్ ఏపీలో పెద్ద చర్చ. విపక్షాల్లో కూడా అదే హాట్ టాపిక్. వారితో పాటే సొంత పార్టీలో కూడా ఆయన మీద వేడిగా చర్చ సాగుతోంది. ఎందుకంటే రాజు సక్సెస్ అయితే ఆయన బాటలో తలెత్తేవారూ ఉంటారుగా. అందువల్ల తాజా ఘటనలతో ఆయన్ని జాగ్రత్తగా డీల్ చేయలేక పార్టీ పరంగా వైసీపీ చతికిలపడింది అన్న సందేశం వైసీపీలోని యావత్తు జనాలకు చేరిపోయింది.
ఆ తేడా చూడరా…?
పార్టీ ఉంటేనే ఎవరికి అయినా పదవులు వస్తాయి. జగన్ సీఎం అయినా మరొకరు మంత్రి అయినా కూడా ఆ పార్టీ నుంచే రావాలి. అలాంటి పార్టీ ఇపుడు అధికారం వెలుగుల్లో ఎక్కడా కనిపించడంలేదు. అసలు ఇంతకీ రఘురాముడి కేసు పార్టీ పరిధిలోనిదా ప్రభుత్వ పరిధిలోనిదా అన్నదే చర్చ. చేతిలో అధికారం ఉంది కాబట్టి తెచ్చి జైలులో పెట్టమంటే కుదురుతుందా. అందుకే బెయిల్ మీద రాజు బయటకు వచ్చేశారు. ఆయనది అసమ్మతో, అసంతృప్తో తెలుసుకునే ప్రయత్నం పార్టీలో ఎక్కడైనా జరిగిందా అన్నదీ ప్రశ్నే. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా అన్నట్లుగా రాజు విషయంలో పార్టీ పరంగా చేయాల్సిన చర్యలు చేయలేదు అన్నదే వైసీపీలో వినిపిస్తున్న మాట. జగన్ సీఎం గా కాకుండా పార్టీ అధినేతగా ఈ రెబెల్ ఎంపీని పిలిచి మాట్లాడి ఉంటే అదో కధగా ఉండేది. అంటే పార్టీ అధినేత రోల్ ఇక్కడ సైలెంట్ అయితే సీఎం హై హ్యాండ్ తో ముందుకు వచ్చారన్న మాట. అలా డ్యూయల్ రోల్ లో జగన్ ఒక్క దానికే పరిమితమైతే రెండవ రోల్ షాడో అయిందన్న మాట.
పార్టీ వేదికల మీదనే …?
ఏ పార్టీలో అయినా అసమ్మతి ఉంటుంది. దాన్ని పార్టీ వేదిక మీద నాలుగు గోడల మధ్య సర్దుబాటు చేసుకోవాలి. అధికార పార్టీ అయితే ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి లుకలుకలు వేగంగా బయటకు వస్తాయి. జగన్ విపక్షంలో ఉన్నపుడు ముగ్గురు ఎంపీలను కోల్పోయారు. ఇపుడు అధికారంలో ఉంటూ కూడా ఒక ఎంపీని పోగొట్టుకున్నారు అంటే పార్టీ అధినేతగా తన పనితీరుని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిందేగా. అదే సమయంలో కనీసం ఆరు నెలలకు ఒకసారి అయిన ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో అధినేత హోదాలో జగన్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే ఇలాంటి దూరాలు అంతరాలూ తగ్గే అవకాశం ఉంటుందిగా. ఏది ఏమైనా జగన్ పార్టీ అధినేత పాత్రని పోషించలేకపోతున్నారు అన్నదే విమర్శగా ఉంది. ఇక ఒక్క రఘురాముడి వైపే పార్టీ చూస్తోంది కానీ మరో అయిదుగురు ఎంపీలు కూడా ఆయన మాదిరిగానే వైసీపీలో రగులుతున్నారు అన్నది సంచలమైన ప్రచారం. అదే నిజమైతే మాత్రం వైసీపీకి కొత్త చిక్కులు వచ్చినట్లే. చూడాలి మరి.