ఈ తిట్లన్నీ జగన్ ఖాతాలోకేనా… ?
వైసీపీలో నాయకులు చాలా ఎక్కువగా మాట్లాడుతారు. కొందరు మంత్రులైతే బూతులే మాట్లాడుతారు అని తెలుగుదేశం వారికి పేరు పెట్టేసింది. ఇక అధికారం లో ఉన్నామన్న ధీమాతో పాటు [more]
వైసీపీలో నాయకులు చాలా ఎక్కువగా మాట్లాడుతారు. కొందరు మంత్రులైతే బూతులే మాట్లాడుతారు అని తెలుగుదేశం వారికి పేరు పెట్టేసింది. ఇక అధికారం లో ఉన్నామన్న ధీమాతో పాటు [more]
వైసీపీలో నాయకులు చాలా ఎక్కువగా మాట్లాడుతారు. కొందరు మంత్రులైతే బూతులే మాట్లాడుతారు అని తెలుగుదేశం వారికి పేరు పెట్టేసింది. ఇక అధికారం లో ఉన్నామన్న ధీమాతో పాటు నోరు జారి చాలా మంది నాయకులు అంటున్న మాటలు గడచిన రెండేళ్లల్లో ట్రెడిషనల్ పాలిటిక్స్ ని పూర్తిగా దాటేసాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇవన్నీ జగన్ చెవులకు సోకుకుండానే ఆయనకు తెలియకుండానే జరుగుతున్నాయని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. కానీ నిండు సభలో ఒక ఎమ్మెల్యే రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు మీద మాట్లాడుతూ విప్పిన బూతు పురాణం చూశాక దాని మీద జగన్ కూడా మెచ్చుకోలుగా మాట్లాడాక ఇదంతా అధినాయకత్వం ఇష్టంతోనే జరుగుతోంది అని విపక్షాలు గట్టి పాయింట్ పట్టేసుకున్నాయి.
జగన్ అలా అన్నా …?
నిజానికి అసెంబ్లీలో ఎమ్మెల్యే జోగి రమేష్ రఘురామను విమర్శించిన తరువాత తన ప్రసంగంలో అసభ్య పదాలు ఉంటే తొలగించాలని స్పీకర్ ని కోరారు. దాని మీద జగన్ స్పందిస్తూ ఆయన ఆవేశంలో ఆవేదన ఉంది, అయినా తప్పుని గ్రహించి అసభ్య పదాలు రికార్డుల నుంచి తొలగించమన్నడం భేష్ అన్నట్లుగా మాట్లాడారు. ఇక్కడ జగన్ ఆయన తిట్లను సపొర్ట్ చేయలేదు, కానీ ఆయన ఆవేదనలో నిజాయతీ ఉంది అని అభిప్రాయపడితే విపక్షాలు మాత్రం రాద్ధాంతమే చేస్తున్నాయి. జగనే తన ఎమ్మెల్యేల చేత కోరి విపక్షాలను తిట్టిస్తున్నాయని కూడా ఆరోపిస్తున్నాయి.
తిడితే మంత్రేనా …?
ఎవరు ఎక్కువ బాగా విపక్షాలను బూతులతో తిడితే వారికే జగన్ మంత్రి పదవి ఇస్తారని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అంటున్నారు. జోగి రమేష్ అసభ్యంగా మాట్లాదితే జగన్ మెచ్చుకోవడమేంటి అని ఆయన నిలదీస్తున్నారు. జగన్ మెప్పు కోసం ఇంకా దిగజారి వైసీపీ నాయకులు తిడతారని ఆయన జోస్యం చెబుతున్నారు. వైసీపీ నేతల భాష అసలు బాగుండడంలేదని కూడా ఆయన ఆక్షేపిస్తున్నారు. మరి కొందరు విపక్ష నేతలు అయితే జగన్ కి ఇలా విపక్షాలను తిట్టడం ఇష్టం కాబోలు అందుకే ఆయన మనసెరిగి నేతలు తిట్ల పురాణం లంకించుకుంటున్నారు అని మొత్తం పాపాన్ని జగన్ మీదకు నెట్టేస్తున్నారు.
అదే ప్రమాదం…?
సరే రాజకీయాల్లో విలువల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఇటీవల కాలంలో మాత్రం నాయకులు వాడే భాష మాత్రం చాలా దారుణంగా ఉందన్న అభిప్రాయం అయితే జనంలో ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీకైనా సాలిడ్ గా కొన్ని ఓట్లు ఉంటాయి. మరి గెలుపు ఓటములను నిర్ణయించేది తటస్థ వర్గం. వారిలో మేధావులు, వివేచన కలిగిన వారు ఉంటారు. వారంతా ఇలాంటి వాటిని అసలు ఇష్టపడరు. పైగా అధినాయకుడు జగన్ కి తెలియకుండా నేతలు రెచ్చిపోతున్నారు అని ఇన్నాళ్ళూ భావించినా జగన్ ఎదుటనే అసెంబ్లీలో జోగి రమేష్ మాట్లాడితే దాన్ని ఖండించలేదన్నది బాగా జనంలోకి వెళ్తే అక్కడ డ్యామేజ్ జరిగేది వైసీపీకే. ఇక మంత్రులుగా ఎంపిక చేసేటపుడు కూడా తిట్ల పురాణాలు వల్లె వేసిన వారిని పక్కన పెట్టకపోతే అది కూడా ప్రభుత్వ, పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తుంది. మరి వైసీపీ అధినాయకత్వం దీన్ని గ్రహించాలనే ఆ పార్టీ శ్రేయోభిలాషులు కోరుతున్నారు.