పోయిన సారి అంత ఈజీ కాదట ఈసారి
గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ అధినేతగా ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించి జగన్ రికార్డు సృష్టించారు. ఒకరకంగా అదే [more]
గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ అధినేతగా ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించి జగన్ రికార్డు సృష్టించారు. ఒకరకంగా అదే [more]
గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ అధినేతగా ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించి జగన్ రికార్డు సృష్టించారు. ఒకరకంగా అదే ఆయనకు అడ్వాంటేజీ అయిందంటారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరికలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి జగన్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించే సీన్ లేదంటున్నారు పార్టీ నేతలే.
అభ్యర్థుల ఎంపిక…?
ఈసారి అభ్యర్థుల ఎంపిక జగన్ కు ఇబ్బందిగా మారనుంది. గతంలో ప్రతిపక్షంలో ఉండటంతో తాను అనుకున్న మాదిరి, ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన నివేదికలను అనుసరించి అభ్యర్థులను ప్రకటించారు. దీంతో జగన్ కు పెద్దగా అసంతృప్తులు తలెత్తలేదు. అయితే ఈసారి జగన్ అధికారంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై ఎక్కువ మంది ప్రజల్లో అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. అనేక కారణాల వల్ల ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉంటున్నారు.
అనేక మందిపై అసంతృప్తి….?
ప్రధానంగా కరోనా సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలను పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో పాటు ఎమ్మెల్యేల పనితీరు పై జగన్ సయితం అసంతప్తిగా ఉన్నారని తెలిసింది. దాదాపు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ మూడేళ్లలో వారు పనితీరును మెరుగుపర్చుకోకుంటే వారికి తిరిగి టిక్కెట్ ఇవ్వడం కష్టమే.
పనితీరు మార్చుకోకుంటే?
అధికశాతం మంది ఎమ్మెల్యేలు జగన్ కు విధేయులుగా ఉన్నవారే. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కొనసాగుతున్నవారే. అయితే వారిని కాదని కొత్తవారిని అభ్యర్థులుగా ప్రకటించడం జగన్ కు కష్టమే. దీంతో పాటుఎంపీలు కొంతమంది తమకు ఈసారి ఎమ్మెల్యేలుగా అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు గత ఎన్నికల మాదిరి అభ్యర్థులను ఎంపిక చేయడం అంత సులువు కాదంటున్నారు. అసంతృప్తులు, గోడదూకుళ్లు ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు.