ఢిల్లీలో జగన్ ఆపరేషన్… పేషంట్ ఆయనేనా… ?
జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన మీద అనేక రకాల ఊహాగానాలు, ప్రచారాలు జోరుగా సాగాయి. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఇంత అసాధారణమైన తీరులో స్పెక్యులేషన్స్ [more]
జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన మీద అనేక రకాల ఊహాగానాలు, ప్రచారాలు జోరుగా సాగాయి. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఇంత అసాధారణమైన తీరులో స్పెక్యులేషన్స్ [more]
జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన మీద అనేక రకాల ఊహాగానాలు, ప్రచారాలు జోరుగా సాగాయి. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఇంత అసాధారణమైన తీరులో స్పెక్యులేషన్స్ రావడం ఇదే తొలిసారి అనుకోవాలి. దానికి సమయం సందర్భం కూడా జత కలిసాయని కూడా చెప్పుకోవాలి. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఒక వైపు సీబీఐ కోర్టులో ఉంది. మరో వైపు ఆయన మీద రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బాణాలు వేస్తున్నాడు. దీంతో జగన్ ఢిల్లీ వెళ్ళింది స్వకార్యానికే అన్న దాన్ని టీడీపీ దాని అనుకూల మీడియా గట్టిగా ప్రచారం చేశాయి. దానికి తగినట్లుగానే జగన్ అమిత్ షాతో సుదీర్ఘమైన చర్చలే జరిపారు.
ఇజ్జత్ కే సవాల్ ..?
రఘురామ కృష్ణంరాజు రెబెల్ ఎంపీగా ఉంటూ జాతీయ స్థాయిలో వైసీపీ పరువుని తీస్తున్నారు. అందువల్ల ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయించాలన్నది జగన్ పట్టుదల. ఇంతవరకూ ఈ విషయంలో ఎంపీల లెవెల్ లోనే విన్నపాలు వెళ్ళాయి. దానికి పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అందుకే జగనే రంగంలోకి దిగి ఎవరికి చెప్పాలో వారికే చెప్పారని అంటున్నారు. మొత్తం ఏపీ సర్కార్ ని, తన ఇమేజ్ ని, 27 మంది ఎంపీలని కూడా పందేనికి ఒడ్డి మరీ రఘురామ కృష్ణంరాజు ను మాజీ చేయాలని జగన్ గట్టిగానే తలపోస్తున్నారు అంటున్నారు. దీనిని పొలిటికల్ మ్యాటర్ గానే తేల్చుకోవాలని ఆయన భావించే అలా చేశారు అంటున్నారు.
సీటు చిరిగేనా…?
కేంద్రంలో సర్వంసహాగా మారి చక్రం తిప్పుతున్న వారి వద్దనే జగన్ ఈ విషయం ప్రస్తావించి తనకు ఎంతటి ప్రతిష్టాత్మకమో చెప్పారని అంటున్నారు. అక్కడ నుంచి కనుక సానుకూలంగా రిజల్ట్ వస్తే నర్సాపురం ఎంపీ సీటుకు ఉప ఎన్నిక ఖాయమని అంటున్నారు. తొందరలోనే రఘురామ కృష్ణంరాజు మాజీ అవుతారని కూడా వైసీపీ వర్గాలు ఊహిస్తున్నాయి. ఇక జగన్ సైలెంట్ ఆపరేషన్ తరువాత వైసీపీ ఎంపీలు మరోసారి స్పీకర్ ఓం బిర్లాను కలసి రఘురామ కృష్ణంరాజు మీద వేటు వేయాలని కోరుతారు అంటున్నారు. దీంతో కచ్చితంగా ఈసారి స్ట్రాంగ్ డెసిషనే వస్తుందని ఆశిస్తున్నారు.
తూకంలో తులసీదళమా..?
మరో వైపు చూస్తే రఘురామ కృష్ణంరాజు ఒక్కడు చాలు అన్నట్లుగా సీన్ ఉంది. ఇంతమంది వైసీపీ ఎంపీలు, ఒక బలమైన ప్రభుత్వం ఉన్నా కూడా తాను మాత్రం అపరిమితమైన రాజకీయ బలంతో పోరాడుతున్నారు. ఆయనకు అండగా ఒక కీలకమైన కేంద్ర మంత్రి ఉన్నారని చెబుతున్నారు. ఆయన సీనియర్ మోస్ట్ కావడంతో ఆయన మాటను ఎవరూ కాదనలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఆయన సహకారంతోనే రఘురామ కృష్ణంరాజు మీద వేటు పడడంలేదని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీలో ఇతర పెద్ద తలకాయలు కూడా ఏమీ చేసేది లేదన్న మరో వాదన కూడా ఉంది. అయితే అన్ని రోజులూ ఒక్కలా ఉండవు. పైగా బీజేపీకి జగన్ అవసరం కనుక ఉంటే తప్పకుండా ఈసారి ఆయన డిమాండ్ మేరకు రాజుని మాజీని చేయనూ వచ్చు అన్న మాట ఉంది. మొత్తానికి కొద్ది రోజులలో జరగబోయే పరిణామాలే జగన్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లా కానట్లా అన్నది నిర్ణయిస్తాయని అంటున్నారు.