`మార్కులు` అంటూనే జగన్ `రిమార్కు` నిర్ణయాలు
ఔను! ఇప్పుడు ఈ మాట వైసీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు సీఎం జగన్ వైఖరిపై మనసులోనే తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. `మా [more]
ఔను! ఇప్పుడు ఈ మాట వైసీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు సీఎం జగన్ వైఖరిపై మనసులోనే తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. `మా [more]
ఔను! ఇప్పుడు ఈ మాట వైసీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు సీఎం జగన్ వైఖరిపై మనసులోనే తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'మా నాయకుడు ఇలా ఎందుకు చేస్తున్నారు?' అంటూ.. వారు వాపోతున్నారు. దీంతో అసలు విషయం ఏంటనేది ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే.. గత 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారికి మార్కులు, ప్రమోషన్లు ఉంటాయని అందరూ అనుకున్నారు. దీనికి జగన్ కల్పించిన ప్రచారమే ప్రధాన కారణం. అయితే.. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణతోపాటు.. కొన్ని నామినేటెడ్ పదవుల నియామకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బాగా పనిచేసిన వారికి.. ఖచ్చితంగా ప్రమోషన్ ఉంటుందని అనుకున్నారు. ఇలానే చాలా మంది నేతలు.. ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలు.. నియోజకవర్గంలో కష్టపడ్డారు. ప్రజలకు చేరువ అయ్యారు.
కష్టపడి పనిచేసినా…?
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. వీరిలో ఎక్కువ మంది కొత్తవారే ఉన్నారు. అంతేకాదు.. వీరికి పెద్దగా సిఫారసులు కూడా లేవు. కేవలం జగన్ పేర్కొన్న మార్కులనే నమ్ముకున్నారు. కానీ.. ఇప్పుడు జరుగుతున్న కీలక పరిణామాలు పరిశీలిస్తున్నవారు, త్వరలోనే జరగనున్న నియామకాలపై ఉప్పందిన కొందరు నేతలు.. మార్కుల విషయం ఏమైందని ? సీనియర్లకు పదే పదే ఫోన్లు చేస్తున్నారట. మేం ఎంతో కష్టపడుతున్నాం.. చాలా మంది సీనియర్లు పట్టించుకోవడం లేదు. కానీ, మేం మాత్రం నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నాం. అయినా.. మమ్మల్ని పట్టించుకోరా ? మాపని ఇంతేనా ? అని వారు నిష్టూరంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలోనూ వినిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా వినిపిస్తోంది.
రెండేళ్లవుతున్నా…?
ఇంకా చెప్పాలంటే ఎన్నికలు జరిగి రెండేళ్లు అయ్యాయి. ఇప్పటికీ జగన్ అపాయింట్మెంట్ దొరకని ఎమ్మెల్యేలు 50 మంది వరకు ఉన్నారంటే వారిలో పరిస్థితి ఎంతలా ఉంటుందో ? కూడా అర్థం చేసుకోవచ్చు. జగన్ దగ్గర డప్పులు, డాబాలు కొట్టుకుని మేనేజ్ చేసే వారి పరిస్థితి ఓకే.. ఇప్పటికీ, ఎప్పటకీ అపాయింట్మెంట్ ఉంటుందా ? ఉండదా ? ఆయన కనికరిస్తారో ? లేదో ? అన్న సందేహం ఉన్న నేతలు పైకి చెప్పుకోలేక పోయినా లోపల కన్నీటి వేదనే అనుభవిస్తున్నారట. ఇటీవల గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఓ చోట సమావేశం అయినప్పుడు ఓ ఎమ్మెల్యే అయితే నిధులు లేవు.. పిలుపులు లేవు.. గత ఎన్నికలకు చేసిన అప్పులు ఎప్పటికి తీరతాయో ? తెలియట్లేదని భోరుమన్నారట. పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు సర్దిచెప్పడంతో ఆయన కన్నీళ్లు తుడుచుకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తన నిర్ణయాలు మార్చుకోకపోతే పార్టీకి ఎదురు దెబ్బలు తప్పవనే చెప్పాలి.