జగన్ టెన్షన్ అలా… మంత్రుల భయం ఇలా … ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయ్యింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించింది ఏంట్రా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి ఇదీ అని లేదు. ఏదో [more]
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయ్యింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించింది ఏంట్రా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి ఇదీ అని లేదు. ఏదో [more]
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయ్యింది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించింది ఏంట్రా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి ఇదీ అని లేదు. ఏదో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం… సచివాలయాలు ఏర్పాటు చేశాం… స్థానిక సంస్థల ఎన్నికలను స్వీప్ చేశాం అనడం మినహా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఆదాయం గురించి మాట్లాడుకోవడానికేం లేదు. అంతా జీరో. ఓ వైపు కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం కూడా పలు విమర్శలకు తావిస్తోంది. జగన్ టెన్షన్లు జగన్కు ఉన్నాయి. ఓ వైపు ఆదాయం లేదు.. కరోనా పన్నులకు భారీగా గండి కొట్టేసింది. మరో వైపు సంక్షేమ పథకాల భారం ప్రభుత్వంపై నెల నెలకు కోట్లలోనే భారం పడుతోంది.
ఆర్థిక పరిస్థితి…..
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలే జరగడం లేదు. ఆర్థిక వ్యవస్థను కనీసం ట్రాక్ ఎక్కిద్దామని రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నా రాష్ట్రం మరింత లోటు బడ్జెట్లోకి వెళ్లిపోతోంది. ఇక ఇప్పటికే ఉన్న హామీలు, సంక్షేమ పథకాలకు తోడు కొత్త హామీలు వస్తున్నాయి. చివరకు వీటిల్లో చాలా వరకు నెరవేర్చలేని పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎంత దుస్థితిలో ఉందంటే వ్యవసాయ పథకాల్లో చాలా వాటికి రాయితీలు ఇచ్చే విషయం కూడా ప్రభుత్వం మర్చిపోయింది. గత కొన్నేళ్లుగా రైతులకు సంబంధించి అనేక రాయితీలు వచ్చేవి. అవన్నీ ఇప్పుడు పూర్తిగా కట్ అయిపోయాయి.
కరోనా దెబ్బకు…..
రాష్ట్రం అప్పులపై కేంద్ర ప్రభుత్వం సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నా ఆదాయం పెంచే మార్గాలు పెంచకపోగా.. ఉన్న ఆదాయ మార్గాలను కూడా కోల్పోతున్న పరిస్థితి. అందుకు కరోనా కొంత కారణం అయితే.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు కూడా కారణమే. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ఏ నెలకానెల వెతుక్కుంటున్నారు. జగన్కు లోపల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పాలన చేయగలనా ? అన్న ఆందోళన ఉన్నా ? కూడా ఇవన్నీ వదిలేసి కేవలం రాజకీయం చేయడంపైనే దృష్టి పెడుతోన్న వాతావరణం కూడా ఉంది.
నిధులు లేక….
ఇక జగన్ తీరు ఇలా ఉంటే మంత్రుల భయాలు మంత్రులకు ఉన్నాయి. తాము శాఖలకు మాత్రమే పేరుకు మంత్రులుగా ఉన్నా.. నిధులు మాత్రం లేవు. మంత్రుల్లో చాలా మందికి మరో రెండు నెలల్లో తమ పదవులు ఉంటాయో ? ఊడతాయో ? అన్న భయాలు ఉన్నాయి. పేరుకు మాత్రమే వాళ్లు మంత్రులుగా ఉన్నా నియోజకవర్గాల్లో కూడా వారి పనులు కావడం లేదు. సంగం మంది మంత్రులు సచివాలయానికే రావడం లేదు. చాలా మంది తమ శాఖల అధికారులతో మాట్లాడడం లేదు.. మరి కొందరు మంత్రుల మాటలు అధికారులు వినడం లేదు. రెండున్నరేళ్ల తర్వాత పదవులు ఉండవని భావిస్తోన్న వారు ఏం చేశామో చెప్పుకునేందుకు కూడా భయపడుతున్నారు. ఏదేమైనా ఏపీలో పాలన అస్తవ్యస్తంగా ఉందని చెప్పేందుకు ఇవే నిదర్శనం.