జగన్ లో తొలిసారి భయం…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ మీడియాకు భయపడరు. ఆయనకు ఒక ప్రధాన వర్గం మీడియా తొలి నుంచి వ్యతిరేకమని తెలుసు. తాను పార్టీ పెట్టినప్పటి నుంచే ఆ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ మీడియాకు భయపడరు. ఆయనకు ఒక ప్రధాన వర్గం మీడియా తొలి నుంచి వ్యతిరేకమని తెలుసు. తాను పార్టీ పెట్టినప్పటి నుంచే ఆ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ మీడియాకు భయపడరు. ఆయనకు ఒక ప్రధాన వర్గం మీడియా తొలి నుంచి వ్యతిరేకమని తెలుసు. తాను పార్టీ పెట్టినప్పటి నుంచే ఆ వర్గం మీడియా తనను టార్గెట్ చేస్తుందని తెలుసు. అయినా తాను తట్టుకుని జనంలోకి వెళ్లి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జగన్ తొలిసారి మీడియాకు భయపడినట్లే కన్పించింది. జగన్ తన రెండేళ్ల పాలనలో ఎప్పుడూ ఇంతగా మీడియాపై విరుచుకు పడింది లేదు.
ఎన్ని కథనాలు వచ్చినా?
రెండేళ్ల పాలనలో తనపై వ్యతిరేకత వస్తుందేమోనన్న భయం జనంలో కన్పిస్తుంది. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమ కార్యక్రమాలనే జగన్ నమ్ముకున్నారన్నది వాస్తవం. జగన్ తనపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా పెద్దగా పట్టించుకోరు. లక్ష కోట్ల అవినీతి అని చంద్రబాబు, మీడియా ప్రచారం చేస్తేనే ప్రజలు దానిని పక్కన పెట్టారు. అందుకే రెండేళ్ల నుంచి ఇసుకలో అవినీతి, నాడు – నేడులో స్కామ్ అని విమర్శలు చేసినా, మీడియాలో కథనాలు వచ్చినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు.
రెండేళ్లలో ఏనాడూ….
కానీ ఇటీవల ఒక ప్రధాన పత్రికలో తనపై వచ్చిన కథనంతోనే ఆయన వైఖరిని మార్చుకున్నట్లు కనపడుతుంది. గత రెండేళ్ల కాలంలో ఒక వర్గం మీడియాలో పతాక శీర్షికలతోనే ఎన్నో కథనాలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి. కానీ వాటిని ఆయన లైట్ గా తీసుకున్నారు. మంత్రులు మాత్రం ఖండించేవారు. కానీ ఇటీవల ఒక పత్రికలో తన మానసిక పరిస్థితి, రాత్రివేళ జీసస్ తో మాట్లాతారని కథనాలు రావడం జగన్ ను ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది. అందుకే రెండేళ్ల తర్వాత మీడియా పై అంతగా జగన్ విరుచుకుపడ్డారు.
ఆ కథనం వల్లనేనా?
తన మానసిక పరిస్థితిపై ఒక వర్గం మీడియా కథనాలు రావడంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారని తెలిసింది. రానున్న మూడేళ్ల కాలంలో మరింతగా వ్యతిరేక కథనాలు వస్తాయని తెలుసు. కానీ ఆక్సిజన్ సిలెండర్లు లేక ముగ్గురు మృతి చెందారన్న కథనంపై జగన్ ఆగ్రహం చెందడం వెనక అసలు కారణం అదేనంటున్నారు. తన మానసిక పరిస్థితిపై కథనం రాసిన పత్రికపై పరువు నష్టం దావా వేసేందుకు జగన్ రెడీ అయ్యారని తెలుస్తోంది. ఎటూ తనకు వ్యతిరేక కథనాలు ఆ వర్గం మీడియాలో వస్తాయని తెలిసినా జగన్ ఆగ్రహం చెందడం రానున్న పరిణామాలకు సంకేతాలని చెబుతున్నారు.