జగన్ ఇలా చేస్తే.. కమ్మలకు చెక్ పెట్టినట్టే
రాజకీయంగా మరింత దూకుడు పెంచితేనే.. వచ్చే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందనే విషయం సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పుడు ఒక వ్యూహంతో ఆయన దూసుకుపోతున్నా.. [more]
రాజకీయంగా మరింత దూకుడు పెంచితేనే.. వచ్చే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందనే విషయం సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పుడు ఒక వ్యూహంతో ఆయన దూసుకుపోతున్నా.. [more]
రాజకీయంగా మరింత దూకుడు పెంచితేనే.. వచ్చే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందనే విషయం సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పుడు ఒక వ్యూహంతో ఆయన దూసుకుపోతున్నా.. సామాజిక వర్గాల పరంగా కమ్మ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కమ్మ వర్గంపై జగన్ తీవ్ర విమర్శలు చేయడం.. అమరావతి వారికోసమే నిర్మించారని.. ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం లేదని.. అందుకే ఇలాంటి రాజధాని మనకు అవసరమా ? అని ఆయన చేసిన వ్యాఖ్యలపై కమ్మ వర్గం గుస్సాగా ఉన్న విషయం తెలిసిందే. ఇక, ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు కూడా దీనికి మరింత ప్లస్ అయింది.
కమ్మల్లో ఆగ్రహం….
ఇక, ఎన్నికల విషయానికి వస్తే.. కమ్మ సామాజిక వర్గం గత ఎన్నికల్లో లోపాయికారీగా జగన్‌కు సహకరించింది. చంద్రబాబు తమవాడే అయినా.. తమను పట్టించుకోలేదనే ఆవేదనతో వీరిలో చాలా మంది పైకిబాగానే ఉన్నప్పటికీ.. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నారు. కానీ, ఇప్పుడు వీరంతా యూటర్న్ తీసుకుని.. మళ్లీ బాబు అధికారంలోకి రావాలనే జపం చేస్తున్నారు. ఈ క్రమంలో కమ్మ సామాజిక వర్గం.. జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. దీనిని అడ్డుకునేందుకు జగన్‌కు ఇప్పుడు ఒక ఆయుధం లభించిందని అంటున్నారు పరిశీలకులు. అదే.. టీటీడీ చైర్మన్ పదవి.
టీటీడీ కొత్త ఛైర్మన్ గా….
ప్రస్తుతం టీటీడీ బోర్డు రద్దయిన నేపథ్యంలో త్వరలోనే తిరిగి దీనిని పునరుద్ధరించనున్నారు. ఈ నేపథ్యంలో బోర్డుకు చైర్మన్‌గా కమ్మ వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయడం ద్వారా .. ఈ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చిన సంకేతాలు ఇచ్చినట్టువుతుంది. ఇక్కడ చాలా ఈక్వేషన్లు జగన్‌కు ప్లస్ అవుతాయి. తనపై కమ్మ వర్గంలో నెలకొన్న అసంతృప్తిని.. జగన్‌పై ఉన్న కమ్మ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు మంచి ఛాన్స్ అని పార్టీలోనే ఓ వర్గంలో చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పేరును పరిశీలిస్తే.. మరింత మంచిదనే సూచలు వస్తున్నాయి. ఆయనకు మంత్రి పదవి ఇస్తానని.. జగన్ హామీ ఇచ్చి.. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా పెట్టారు.
మర్రికి అవకాశం ఇస్తే…..
స్థానిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో జగన్ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. దీంతో ఇప్పుడు కనుక ఈయనను టీటీడీ చైర్మన్‌ను చేస్తే.. మంత్రిని మించిన పదవి ఇచ్చినట్టు అవడంతోపాటు.. కమ్మ వర్గానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని వైసీపీలో గుసగుస వినిపిస్తోంది. అదేసమయంలో మర్రిని పక్కన పెడితే.. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.. టీటీడీ చైర్మన్ గిరీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈయనకు ఈ పదవిని ఆఫర్ చేస్తే.. వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగానే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
రాయపాటికి ఇస్తే…?
టీటీడీ చైర్మన్ పదవి చేపట్టడం అనేది రాయపాటి జీవిత కల. ఈయనను చైర్మన్‌గా నియమించినా.. జగన్‌కు ఒకే దెబ్బకు రెండు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు చేయనిది జగన్ చేశారని.. అదే సమయంలో కమ్మలకు ప్రాధాన్యం ఇచ్చారని.. పెద్ద ఎత్తున కమ్మల్లో ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదేమైనా.. టీటీడీ చైర్మన్ పదవిని ఇప్పుడున్న పరిస్థితిలో కమ్మలకు కేటాయించడం జగన్‌కు ప్లస్ అవుతుందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.