జగన్ కు అనుకూలంగా నిర్ణయాలు..అందుకేనా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారు. జలవివాదాల్లో జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారు. జలవివాదాల్లో జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారు. జలవివాదాల్లో జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం జగన్ కు అనుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి బోర్డు పరిధులను నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం రెండు అధీనంలో ఉన్న ప్రాజెక్టులను కేంద్రం తన పరిధిలోకి తీసేసుకుంది.
జగన్ ప్రతిపాదనను…
గత కొన్ని వారాలుగా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖలు మీద లేఖలు రాశారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్ణయిస్తూ గెజిట్ ను విడుదల చేయాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇది జగన్ కు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమే అని చెప్పాలి.
జగన్ అవసరమే…?
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంపై భగ్గుమంటోంది. ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపిస్తుంది. అయితే బీజేపీకి మాత్రం కేసీఆర్ కన్నా జగన్ అవసరమే రానున్న కాలంలో ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మోదీ సర్కార్ జగన్ కు అనుకూల నిర్ణయం తీసుకుందంటున్నారు. దీంతో పాటు రఘురామ కృష్ణరాజు అనర్హత పిటీషన్ పై నోటీసులు ఇవ్వడం కూడా కొంత సానుకూల పరిణామంగానే వైసీపీ చూస్తుంది.
పీకే ఎంట్రీ తో….?
ఇటీవల ప్రశాంత్ కిషోర్ మోదీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ కు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. జగన్ ప్రస్తుతం బలంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మెజారిట ీస్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. జగన్ ఆ కూటమి వైపు వెళ్లకుండా ఉండేందుకే జగన్ కు సానుకూలంగా వ్యవహరించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించినట్లు కనపడుతుంది. మొత్తం మీద జగన్ నదీ జలాల అంశంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.