‘ కమ్మ ‘ లను పూచిక పుల్లలా తీసేసిన జగన్ ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులాల విషయం తరచూ ప్రస్తావనకు వస్తోంది. ఆ మాటకు వస్తే సీఎం జగన్ ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ [more]
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులాల విషయం తరచూ ప్రస్తావనకు వస్తోంది. ఆ మాటకు వస్తే సీఎం జగన్ ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ [more]
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులాల విషయం తరచూ ప్రస్తావనకు వస్తోంది. ఆ మాటకు వస్తే సీఎం జగన్ ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ ప్రభుత్వంలో కమ్మలకే అన్ని పదవులు కట్టబెట్టేసి.. మిగిలిన కులాలను తీవ్రంగా అన్యాయానికి గురి చేస్తున్నారంటూ ఆ కులాన్ని ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా అమరావతి రాజధాని కేవలం కమ్మ కులం కోసమే బాబు ఏర్పాటు చేశారని విమర్శలు చేయడంతో పాటు చివరకు నిమ్మగడ్డ రమేష్ ఇలా ఏ కమ్మ అధికారిని అయినా కులం పేరుతోనే టార్గెట్ చేస్తూ వచ్చారు.
మేయర్ పదవి విషయంలోనూ…
ఇక ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల మేయర్, మునిసిపల్ చైర్మన్ల విషయంలోనూ కమ్మలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒక్క మేయర్ పదవి కూడా కమ్మ వర్గానికి ఇవ్వలేదు. రాజధాని పరిధిలో కమ్మ వర్గ ప్రాబల్యం ఎక్కువుగా ఉన్న విజయవాడ, గుంటూరు రెండు జనరల్ వర్గానికి రిజర్వ్ అయినా కూడా జగన్ గుంటూరు కాపులకు, విజయవాడ బీసీ మహిళకు కేటాయించి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో కూడా కమ్మలను పూచిక పుల్లల్లా తీసేసినట్టే లిస్ట్ చెపుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, మహిళలకు భారీ స్థాయిలో పదవులు ఇచ్చానని చెప్పుకున్న జగన్, వైసీపీ ప్రభుత్వ పెద్దలు, రెడ్లు, కాపులకు భారీగా పెద్దపీట వేశారు.
వేళ్ల మీద లెక్క పెట్టేలా?
ఇక కమ్మలకు ఇచ్చిన నాలుగు పదవులు వేళ్లమీద లెక్కపెట్టేసేలా ఉన్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ తాతినేని పద్మావతికి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు పదవి కట్టబెట్టారు. ఆమె 2014 ఎన్నికల్లో పెనమలూరు సీటు ఆశించారు. జగన్ హామీ ఇచ్చి కూడా సీటు ఇవ్వలేదు. ఇక అదే జిల్లాకు చెందిన తుమ్మల చంద్రశేఖర్ రావుకు ఏపీ కమ్మ వెల్ఫేర్ డవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ పదవి ఎలాగూ కమ్మలకు ఇవ్వడం మినహా గత్యంతరం లేదు. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి వైసీపీ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్యకు ఎవ్వరికి పేరు కూడా పెద్దగా తెలియని శాప్నెట్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇది ఏపీ విద్యా మంత్రిత్వ శాఖ కంట్రోల్ లో ఉంటుంది. అద్దంకిలోనే పార్టీని నడిపించలేని కృష్ణ చైతన్యకు ఈ పదవిలో వెలిగేది కూడా ఉండదు.
ఇచ్చినా ఒరిగేదేముంది?
ఇక గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ డవలప్మెంట్ చైర్మన్ పదవి గన్నమని జనార్థన్ రావుకు ఇచ్చారు. అసలు విశాఖలో కమ్మ ఎంపీ ఉంటేనే ఏం చేసే పరిస్థితి లేదు. ఇక ఇప్పుడు ఆయనకు ఈ పదవి ఇచ్చినా చేసేదేం ఉండదు అన్నది తెలిసిందే. ఇక జిల్లా స్థాయి పదవుల్లో కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిని తన్నీరు నాగేశ్వరరావుకు, ప్రకాశం డీసీఎంఎస్ చైర్మన్ పదవిని పరుచూరు ఇన్చార్జ్ రావి రామనాథం బాబు భార్య రావి పద్మావతికి ఇచ్చారు.