మోడీ కీలక డెసిషన్… జగన్ కి వరం… బాబుకు శాపం.. ?
అధికారంలో ఉన్నవారికే అన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఏపీలో జగన్ ఇపుడు పవర్ లో ఉన్నారు. ఇక పొలిటికల్ గా పవర్ [more]
అధికారంలో ఉన్నవారికే అన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఏపీలో జగన్ ఇపుడు పవర్ లో ఉన్నారు. ఇక పొలిటికల్ గా పవర్ [more]
అధికారంలో ఉన్నవారికే అన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఏపీలో జగన్ ఇపుడు పవర్ లో ఉన్నారు. ఇక పొలిటికల్ గా పవర్ ఫుల్ గా ఉన్నారు. ఆయన్ని ఢీ కొట్టాలి అంటే ఇపుడున్న అస్త్రాలు ఆయుధాలు ఏ మాత్రం సరిపోవు అన్నది తెలుస్తున్నా కూడా అపర చాణక్యుడు చంద్రబాబుకు కొత్తగా ఏదీ తోచడంలేదు. దాంతో ఆయన చేష్టలుడిగి చూస్తున్నారు. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకం, ఒక్కమాటలో చెప్పాలి అంటే చివరి ఎన్నికలు. అదే టైమ్ లో జగన్ కి కూడా కీలకం కానీ చంద్రబాబు మాదిరిగా కాదు. ఇక 2024 ఎన్నికలు మోడీకి కూడా చావో రేవో లాంటివే. దాంతో మోడీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అది అటు తిరిగి ఇటు తిరిగి జగన్ కి వరంగా మారుతోందిట.
ఎంపీ సీట్లు పెంపు..?
దేశంలో 2024 నాటికి ఇపుడున్న ఎంపీ సీట్లను రెట్టింపు చేస్తారుట. బీజేపీలో హాట్ హాట్ గా వినిపిస్తున్న మ్యాటర్ ఇది. అంటే ఇపుడున్న ప్రతీ లోక్ సభ సీటు రెండుగా మారుతుందిట. 543 ఎంపీ సీట్లు వేయి సీట్లు అవుతాయట. అందుకోసమే కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం అని కూడా చెబుతున్నారు. శరవేగంగా నిర్మాణం అవుతున్నా నూతన పార్లమెంట్ 2022 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఆ తరువాత రెండేళ్ళకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దీంతో వేయి మంది ఎంపీలతో 2024 తరువాత సభ కొలువు తీరేలా బీజేపీ సీట్లను పెంచుతుంది అంటున్నారు.
గెలుపు ఎత్తుగడ…..
వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే సీట్లను పెద్ద ఎత్తున పెంచడమే మార్గమని బీజేపీ భావిస్తోందిట. దాని కోసం తెర వెనక సీరియస్ గానే కసరత్తు చేస్తున్నారు అంటున్నారు. ఆ విధంగా కనుక ఆలోచిస్తే ఏపీలో ఇపుడు ఉన్న సీట్లు డబుల్ అవుతాయి. అంటే యాభై ఎంపీ సీట్లు వస్తాయన్న మాట. ఇక్కడ జగన్ కి చాలా లాభంగా ఈ నిర్ణయం ఉంటుంది అంటున్నారు. ఉన్న వారిని కంటిన్యూ చేసుకుంటూ పోయినా మరో పాతిక మంది ఎంపీలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడం ద్వారా జగన్ రాజకీయంగా భారీ లాభాన్నే పొందుతారు అంటున్నారు. ఆలాగే జాతీయ రాజకీయాల్లో కూడా స్ట్రాంగ్ అవుతారు.
విభజన హామీ అలా…?
ఇది ఎంపీల సీట్లు పెంచడంతోనే ఆగదని, విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచాలన్న తమ పెండింగ్ డిమాండ్ ని అటు కేసీయార్, ఇటు జగన్ కేంద్రం వద్ద పెడతారు అంటున్నారు. ఇంత పెద్ద కసరత్తు చేస్తున్న బీజేపీ తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా ఉదారంగా ఉంటుంది అంటున్నారు. అంటే అసెంబ్లీ సీట్లను కూడా పెంచుతారు అన్న శుభవార్తను మోడీ వినిపిస్తారుట. అదే జరిగితే అటు కేసీయార్ కి ఎదురుండదు, అక్కడ 150 దాకా సీట్లు వస్తాయి. ఇక్కడ ఏపీలో జగన్ కి 225 సీట్లు వస్తాయి. దాంతో ఏపీలో జగన్ సులువుగా రెండవసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది అంటున్నారు. తాను అనుకున్న విధంగా అసెంబ్లీ సీట్లను విభజించుకుని మరీ జగన్ 2024 ఎన్నికల్లో మళ్ళీ సీఎం కావడం ఖాయమే అంటున్నారు. అలా మోడీ ప్లాన్ బాబుకు గట్టి షాక్ ఇస్తుందనే చెబుతున్నారు.