వాళ్లంతా మళ్లీ వైసీపీకే ఓటేస్తారా?
ఒకరికి మంచి చేస్తే మరొకరకి అది చెడుగా కన్పిస్తుంది. ఎక్కడైనా ఇది సహజం. మంచి వెంటే చెడు వస్తూ ఉంటుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి [more]
ఒకరికి మంచి చేస్తే మరొకరకి అది చెడుగా కన్పిస్తుంది. ఎక్కడైనా ఇది సహజం. మంచి వెంటే చెడు వస్తూ ఉంటుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి [more]
ఒకరికి మంచి చేస్తే మరొకరకి అది చెడుగా కన్పిస్తుంది. ఎక్కడైనా ఇది సహజం. మంచి వెంటే చెడు వస్తూ ఉంటుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లక్ష కోట్లరూపాయలను అలవోకగా పేదప్రజలకు వివిధ పథకాల పేరిట పంచిపెట్టారు. దీంతో పేద వర్గాలు జగన్ కు సహజంగానే దగ్గరవుతాయి. కానీ అదే సమయంలో మధ్యతరగతి ప్రజల మనస్సు చివుక్కు మంటుంది. తమకు పథకాల అర్హత లేకపోవడంతో మధ్య తరగతి ప్రజలు జగన్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారు.
స్మార్ట్ టౌన్ షిప్ లను…
వీరిని మంచిచేసుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్ జగనన్న స్టార్ట్ టౌన్ షిప్ లను ప్రారంభించారు. మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు ఒక కల. దానిని సాకారం చేసేందుకు తక్కువ ధరలో ఇళ్ల స్థలాలను విక్రయించే ప్రక్రియకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే దాదాపు 30 లక్షల మంది పేదలకు ఉచితం ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన జగన్ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది.
లాటరీ పద్ధతుల్లో….
రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలు, నగరాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పట్టణంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ప్లాట్లను వేస్తారు. వీటిని లాటరీ పద్ధతుల్లో కేటాయిస్తారు. ఇందుకోసం ధరను కూడా నిర్ణయించి వాయిదాల పద్ధతులలో సొమ్ము చెల్లించే వెసులుబాటును జగన్ ప్రభుత్వం కల్పించింది. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించారు. అక్కడ అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే చేస్తుండటంతో స్థలానికి తక్కువ కాలంలో మంచి వాల్యూ వస్తుందని ప్రభుత్వం చెబుతుంది.
ఒక వాయిదా చెల్లించినా..?
దీంతో మధ్యతరగతి ప్రజలు వీటి పట్ల ఎక్కువగా మొగ్గు చూపే అవకాశముంది. ఒకసారి వాయిదా పద్ధతుల్లో చెల్లించిన వారంతా తిరిగి జగన్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్న వ్యూహం కూడా దాగి ఉంది. ఈ టౌన్ షిప్ ల ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించినా మరో రెండు, మూడేళ్ల సమయం పడుతుంది కాబట్టి ఎన్నికల సమయంలో మధ్యతరగతి ప్రజలు కూడా తమవైపు మొగ్గుచూపుతారన్న అంచనాలో జగన్ ప్రభుత్వం ఉంది. మొత్తం మీద మధ్యతరగతి ఆశలను టౌన్ షిప్ ల ద్వారా తన ఓటు బ్యాంకుగా జగన్ మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు.