వారంతా అలా పండగ చేసుకుంటున్నారట
ఆర్భాటంగా జగన్ పదవులు పంచారు. అలా ఇలా కాకుండా సంబరాలు చేసుకోమని క్యాడర్ కి చెప్పేశారు. ఈ మధ్య ఏపీలో 137 కార్పోరేషన్లకు చైర్మన్ తో పాటు [more]
ఆర్భాటంగా జగన్ పదవులు పంచారు. అలా ఇలా కాకుండా సంబరాలు చేసుకోమని క్యాడర్ కి చెప్పేశారు. ఈ మధ్య ఏపీలో 137 కార్పోరేషన్లకు చైర్మన్ తో పాటు [more]
ఆర్భాటంగా జగన్ పదవులు పంచారు. అలా ఇలా కాకుండా సంబరాలు చేసుకోమని క్యాడర్ కి చెప్పేశారు. ఈ మధ్య ఏపీలో 137 కార్పోరేషన్లకు చైర్మన్ తో పాటు పాలకవర్గాలను కూడా నియమించారు. ఇందులో రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులు 71 ఉంటే మరో 66 జిల్లా స్థాయి పదవులు ఉన్నాయి. దీంతో తమకూ కుర్చీ దక్కింది అని నాయకులు అంతా తెగ హుషార్ చేస్తున్నారు. మరి ఈ పదవుల కధా కమామీషూ చూస్తే చాలా తమాషాగా ఉంటుందని అంటున్నారు. ఈ పదవులలో చాలా వాటిని ఇంతకు ముందు ఎవరూ చూడలేదు, పేర్లు కూడా వినలేదు అంటే అది జగన్ సర్కార్ అపర సృష్టి అన్న మాట.
చీల్చి చెండాడి మరీ…>
ఏపీ ప్రభుత్వం అసలే ఆర్ధికంగా నానా అవస్థలు పడుతోంది. గట్టిగా చెప్పాలంటే ఉద్యోగులకు జీతాలకే లాటరీ కొడుతున్న సీన్ ఉంది. మరి ఈ సమయంలో నామినేటెడ్ పదవులు అంటే గుది బండగానే చూడాలి. మరి ఇన్నేసి పదవులు పంపిణీ చేయడం అంటే అది వింతగానే కూడా చెప్పుకోవాలి. తమ వారికి పదవులు కావాలి మరి అందుకే జగన్ చాలా చాకచక్యంగా ఉన్న కార్పోరేషన్లను ముక్కలు చేసి మరీ తలా నలుగురికీ పంచేశారు. అంతే కాదు కొత్త పదవులు కూడా సృష్టించి ఇచ్చారు. ఈ పదవుల విధులు ఏంటో, విధానాలు ఏంటో కూడా ఎవరికీ తెలియదు. అంతే కాదు వీటికి నిధులు ఎట్లా సమకూరుస్తారో కూడా అర్ధం కాదు అంటున్నారు.
ఇవే పదవులు….
నాట్యం, సంగీతం, సాహితం ఇలా అన్ని విభాగాలు కలిపి ఒకప్పుడు సాంస్కృతిక కార్పోరేషన్ ఉండేది. దాన్ని ఇపుడు నాలుగు చేసి జగన్ తలా ఒకటీ పంచేశారు. అది కూడా తమ వారికి ఇచ్చుకున్నారు, తప్ప ఆయా రంగాలలో నిష్ణాతులకు కాదని మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ ఈ మధ్య విమర్శలు చేశారు కూడా. ఇక కళలు, భాష అంటే అంత చిన్న చూపా అని కూడా ఆయన నిలదీశారు. మరో వైపు ఆర్టీసీ ప్రభుత్వానికి చెందినది. విలీన ప్రక్రియ కూడా ఆ మధ్యన పూర్తి చేశారు. మరి దానికి కార్పోరేషన్ అని చెప్పడం విడ్డూరంగానే చూడాలి. దానికి కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని విడగొట్టి పదవులు ఇచ్చేశారు అంటున్నారు. ఇవే కాదు సొసైటీ ఫర్ ఎంప్లాయ్ మెంట్ అండ్ ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ట. స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అట. ఇక నగరాభివృద్ధి సంస్థల పేరిట కూడా పదవులు పంచారు.
కాగితాల మీదనేనా ..?
జగన్ పదవులు సృష్టించారు. కానీ వాటికి ఆఫీస్, స్టాఫ్, నిధులు ఇవన్నీ ఎవరు ఇస్తారు. మరి ఈ ప్రశ్న అడగకూడదేమో. దీనికి ఇంతకు ముందు కొంతమంది అలా అడిగి విసిగి వేసారిన వారున్నారు. వారే 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వీరంతా కలిపి దాదాపుగా ఏడు వందల మంది దాకా ఉంటారు. వీరికి ఆఫీస్ అన్నది ఈ రోజుకీ లేదు అని వేదన చెందున్నారు. ఇక జీతాలు అన్నారు కానీ అవి కూడా రావడంలేదు అన్నదే వారి ఆక్రోశం. ఇపుడు వారి పక్కన ఈ నామినేటెడ్ బ్యాచ్ కూడా ఉన్నారనుకోవాలి. గట్టిగా చెప్పాలంటే ఇందులో కొన్ని పదవులకే అన్ని రకాల సౌకర్యం ఉంది. మరి ఇన్నేసి పదవులు ఎందుకిచ్చారు అంటే పేరుకు ముందు తరువాత రాసుకోవడానికి, అలా పండుగ చేసుకోవడానికి. అంతే అంటున్నారు.