బెట్టింగ్ లు ఇప్పుడు దానిపైనే అట
బెట్టింగ్ లు వేసేందుకు ఏదో ఒక ఆసక్తికర అంశం కావాలి. అది దొరికితే చాలు పందెం రాయుళ్ళకు పండగే. ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు, ఫలితాలు, క్రీడలు జైలు, [more]
బెట్టింగ్ లు వేసేందుకు ఏదో ఒక ఆసక్తికర అంశం కావాలి. అది దొరికితే చాలు పందెం రాయుళ్ళకు పండగే. ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు, ఫలితాలు, క్రీడలు జైలు, [more]
బెట్టింగ్ లు వేసేందుకు ఏదో ఒక ఆసక్తికర అంశం కావాలి. అది దొరికితే చాలు పందెం రాయుళ్ళకు పండగే. ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు, ఫలితాలు, క్రీడలు జైలు, బెయిల్ ఇలా కానిదే సబ్జెక్ట్ ఉండదు బెట్టింగ్ లో పాల్గొనడానికి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సీబీఐ కోర్టు లో జగన్ బెయిల్ అంశం ప్రధాన హాట్ టాపిక్ గా మారింది. జగన్ బెయిల్ రద్దు అవుతుందా లేదా ? ఇప్పుడు ఈ అంశంపైనే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ మొదలు అయ్యాయి అంటున్నారు. గ్రామాల్లో రచ్చబండల వద్ద బెయిల్ రద్దు కాదు అని లేదు రద్దు అవుతుంది అనే వాదనలు ప్రజల్లో పార్టీలకు అతీతంగా చర్చలు నిత్యం సాగుతున్నా దానికి మించి ఇప్పుడు ఇదే టాపిక్ పై బెట్టింగ్స్ నడవటం విశేషం.
గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువే …
కోడి పందాలు, గుండాటలు ఇలా పేకలే కాదు ఏదైనా జూదమే గోదావరి జిల్లాల బెట్టింగ్ బంగారు బాబులకు. ముఖ్యంగా భీమవరం వంటి ప్రాంతాల్లో బెట్టింగ్ బ్యాచ్ లు నిరంతరం ఏదో ఒక అంశంపై కోట్ల రూపాయల్లోనే దీన్ని ప్రధాన వ్యాపారంగా సాగిస్తారు. గతంలో సంక్రాంతి కోడి పందాలపై ప్రభుత్వం నో చెబితే రఘురామ కృష్ణం రాజు హై కోర్టు సుప్రీం కోర్టు వరకు ఇది మా సంప్రదాయం అంటూ పోరాటం చేశారు.
కోట్లలోనే…?
ఇప్పుడు అదే రఘురామ సిబిఐ కోర్టు ను జగన్ బెయిల్ రద్దు కోరుతూ కేసు వేసి సంచలనం మరోసారి సృష్ట్టించారు. ప్రస్తుతం ఈ అంశం ఇరు వర్గాలకు ప్రతిష్టాత్మకం అచి కూర్చుంది. వారి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు బెయిల్ వస్తుంది అని కొందరు రాదు అని మరికొందరు ఇప్పుడు కోట్ల స్థాయిలో బెట్టింగ్ లు మొదలు పెట్టడం చిత్రం. అయితే ఆగస్టు 25న జగన్ బెయిల్ కేసులో తీర్పు రానున్న నేపథ్యంలో బెట్టింగ్ బాబుల అదృష్టం ఎలా ఉంటుందో తేలనుంది.