జగన్ టార్గెట్ ఇక ఆ ఇద్దరే నా ?
తెలుగు రాజకీయాల ట్రెండ్ మార్చింది చాణుక్యుడు చంద్రబాబు అనడంలో సందేహం లేదు. ప్రత్యర్థులపై కేసులు పెట్టి వారితో ఆడుకోవడం లో చంద్రబాబు కు మించిన వారు లేరనే [more]
తెలుగు రాజకీయాల ట్రెండ్ మార్చింది చాణుక్యుడు చంద్రబాబు అనడంలో సందేహం లేదు. ప్రత్యర్థులపై కేసులు పెట్టి వారితో ఆడుకోవడం లో చంద్రబాబు కు మించిన వారు లేరనే [more]
తెలుగు రాజకీయాల ట్రెండ్ మార్చింది చాణుక్యుడు చంద్రబాబు అనడంలో సందేహం లేదు. ప్రత్యర్థులపై కేసులు పెట్టి వారితో ఆడుకోవడం లో చంద్రబాబు కు మించిన వారు లేరనే చెబుతారు. ఆయన ప్రస్తుతం జగన్ సర్కార్ వేధింపులపై అల్లరి చేయొచ్చు గాక గతంలో ఆయన చేసిన పనులు కూడా ఇవే గా అన్నది ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ తో చేతులు కలిపి జగన్ పై కేసులు పెట్టించడం కోర్టు ల చుట్టూ తిరిగేలా వ్యూహాత్మకంగా చేసింది చంద్రబాబే నని ప్రతిఒక్కరికి తెలుసు. ఇప్పుడు అదే ఫార్ములాకు అధికారంలోకి వచ్చాకా జగన్ మరింత పదును పెట్టేశారు. అది ఏ స్థాయిలో ఉందొ రోజు టిడిపి కి కనిపిస్తూనే ఉంది.
వరుసపెట్టి జైలు కు …
చింతమనేని ప్రభాకర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ నరేంద్ర, దేవినేని ఉమా ఇలా పేరున్న వారే కాదు టిడిపి నేతలు ఎవరు స్పీడ్ గా ఉన్నా వారి కి జైల్లో చిప్పకూడు పెట్టేవరకు జగన్ నిద్రపోవడం లేదు. ఏ చిన్న అవకాశం వారిని అరెస్ట్ చేసేందుకు ఉన్నా దాన్ని వైసిపి ప్రభుత్వం వాడేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షం లో ఉన్నందున ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ఆయా నాయకులే బుక్ అవుతున్నారు. ప్రస్తుతం జగన్ టార్గెట్ లో ఇంకా ఇద్దరు మిగిలే వున్నారు అంటున్నారు విశ్లేషకులు. వారే టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్. బాబు పై తన ప్రభుత్వం వచ్చినప్పటినుంచి జగన్ ఉచ్చులు విసురుతూనే ఉన్నారు.
బాబు ను పట్టుకోవడం ?
అయితే ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబు వాటిని న్యాయస్థానాల పుణ్యమా అంటూ స్టే లు తెచ్చుకుని గట్టెక్కేస్తున్నారు. ఇప్పటికి బాబు కు ఉన్న స్టే ల రికార్డ్ దేశంలో ఏ పొలిటీషియన్ కి లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బాబును జైల్లో పెట్టడం కన్నా భావి టిడిపి అధినేత నారా లోకేష్ ను లోపల వేయడానికి వైసీపీ స్కెచ్ వేస్తున్నట్లు పసుపు శిబిరంలో ఆందోళన ఉంది. కానీ లోకేష్ ఎంత అల్లరి చేసినా ఆయన్ను అరెస్ట్ చేసి లోపల వేసి హీరో ఇమేజ్ ఇవ్వడం జగన్ కు ఇష్టం లేకే ఇంతకాలం ఉపేక్షిస్తున్నారు అన్న మరో టాక్ వైసిపి లో ఉంది. ఎన్నో అవకాశాలు వచ్చినా లోకేష్ ను వదిలేయడానికి ఇదే రీజన్ అని కూడా చెబుతున్నారు.
హీరో అవుతాడనే ?
సోనియా ను ఎదిరించి 16 నెలలు జైల్లో ఉన్న కారణంగానే జగన్ కు హీరో ఇమేజ్ జనంలో ఏర్పడిందని, రాజకీయాల్లో నెగిటివ్ పాజిటివ్ అవుతుందన్న సూత్రం వైసీపీ అధినేత విషయంలో నిజం అయిందని విశ్లేషకులు అంటారు. అందుకే లోకేష్ ను టచ్ చేయడం లేదని కానీ చంద్రబాబు- లోకేష్ కోటరీ లో ఉన్నవారందరిని ఒకసారి సెంట్రల్ జైలుకు పంపే కార్యక్రమం ఇకపై కూడా నిరంతరం కొనసాగుతుందని తెలుస్తుంది. ప్రతిపక్షం గొంతు ఎత్తితే వారిని గృహ నిర్బంధాల ద్వారా ఎలా అణచి వేయాలో కూడా గతంలో చంద్రబాబు నేర్పిన విద్యనే వైసిపి తూచా తప్పకుండా ఫాలో అవుతూ వస్తుంది. ఒక రకంగా గతంలోని బాబు సర్కార్ ట్రాక్ రికార్డ్ లను సైతం జగన్ సర్కార్ చెరిపేస్తుంది. దాంతో ఈ కేసులు అరెస్ట్ ల అంశం టిడిపి మీడియా లో గోల తప్ప ప్రజల్లో వినోద కార్యక్రమం గానే మారిపోయింది. అప్పుడు వీరిని వారు లోపల వేశారు. ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది తమను లోపల పెట్టిన వారి సంగతి చూస్తున్నారు. ఇది మనకు సంబంధించిన సంగతి కాదని లైట్ తీసుకుంటున్నారు జనం.