ఈ విషయంలో చాలా బ్యాడ్ అవుతున్న జగన్ సర్కార్ ..?
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాల్లో ఒకటి ఇసుక మాఫియా. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతుందంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో నాడు [more]
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాల్లో ఒకటి ఇసుక మాఫియా. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతుందంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో నాడు [more]
తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాల్లో ఒకటి ఇసుక మాఫియా. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో ఇసుక మాఫియా చెలరేగిపోతుందంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో నాడు గొంతెత్తింది. ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయని నాటి విపక్షాలు గగ్గోలు పెట్టినా ఆరోపించినా రెండు యూనిట్ ల లారీ ఇసుక నాలుగువేలరూపాయలకే మార్కెట్ లో లభించేది. వైఎస్ హయాంలో కానీ ఆయన తరువాత పరిపాలించిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల ప్రభుత్వ హయాంలో కానీ వెయ్యి, నుంచి మూడు వేలరూపాయలు దాటి ఉండేది కాదు. కానీ ఇప్పుడు అదే రెండు యూనిట్ల ఇసుక లారీ ధర పదినుంచి పన్నెండు వేలరూపాయలు బహిరంగ మార్కెట్ లో దొరకడంతో ప్రజలు ఇదెక్కడి పాలన అని ప్రశ్నలు సంధించే పరిస్థితి ఎదురౌతుంది.
కేంద్రీకృత వ్యవస్థ తో …
జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక పై అనేక విధానాలు ప్రకటిస్తూ అల్లరి అవుతూ వస్తుంది. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటుతున్నా వైసీపీ సర్కార్ ఇసుక సప్లై లో తప్పటడుగులు తీవ్ర విమర్శలకు, ఆరోపణలకు తెరతీస్తున్నాయి. గతంలో ఎమ్యెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా తినేస్తున్నారని ఆరోపణలు వచ్చినా ప్రస్తుత ధర లేదు. కానీ ఇప్పుడు ఇసుక బంగారం తో సమానంగా చుడాలిసిన దుస్థితి ఏర్పడిందని అంతా వాపోతున్నారు.
అనుభవ రాహిత్యమేనా?
చిల్లర గా దోపిడీని అరికట్టి ఒక ప్రయివేట్ కంపెనీకి వైసీపీ సర్కార్ గంపగుత్తగా కట్టబెట్టిందని దీనివల్ల ప్రజలకు ఒరిగింది ఏమిలేదని పెదవి విరుస్తున్నారు. అనుభవరాహిత్యం తో ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందా లేక అవినీతి లో పాత్ర పోషించి ధరను సామాన్యులకు అందకుండా చేసిందా అన్న ప్రశ్న ఇప్పుడు విపక్షాలకు పదునైన అస్త్రం అయ్యింది. మరో రెండున్నరేళ్ళు అధికారంలో కొనసాగనున్న జగన్ ఇప్పటికైనా ఇసుక యవ్వారంపై కళ్ళు తెరిచి జనం నెత్తిన పిడుగులు వేస్తున్న విధానం సవరించకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం తప్పదన్న టాక్ పెరుగుతుంది.