జగన్ నిర్వేదానికి కారణం ?
జగన్ ఇపుడు ఒక రకమైన అద్వైత స్థితిలో ఉన్నారు. రాజకీయాల్లో వేదాంతానికి తావు లేదు కానీ జగన్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది అంటున్నారు. ఆయనకు అసలు [more]
జగన్ ఇపుడు ఒక రకమైన అద్వైత స్థితిలో ఉన్నారు. రాజకీయాల్లో వేదాంతానికి తావు లేదు కానీ జగన్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది అంటున్నారు. ఆయనకు అసలు [more]
జగన్ ఇపుడు ఒక రకమైన అద్వైత స్థితిలో ఉన్నారు. రాజకీయాల్లో వేదాంతానికి తావు లేదు కానీ జగన్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది అంటున్నారు. ఆయనకు అసలు తత్వం పూర్తిగా బోధపడింది. తన దూకుడు పార్టీలోనే తప్ప పాలనలో పనిచేయదు అని జగన్ గ్రహించారు అంటున్నారు. జగన్ పార్టీలో ఎన్ని కఠోర నిర్ణయాలు తీసుకున్నా నోరు మెదిపేవాడే లేడు.. అడిగే వాళ్లే ఉండరు. ఎవరికి ఎంత కోపం ఉన్నా అణుచుకుని ఉండాల్సిందే. అదే పాలనలో అలా కుదరదు.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. అదే విధంగా తాను చెప్పినట్లుగా చకచకా పనులు కావడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు తనకు నిజమైన మిత్రులు కాదన్న సత్యాన్ని కూడా జగన్ అవగతం చేసుకున్నారని అంటున్నారు. దాంతో జగన్ ఇపుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అన్న నిర్వేదానికి వచ్చేసినట్లుగా చెబుతున్నారు.
పార్టీల కతీతంగా….
ఏపీలో రాజకీయం అంతా జగన్ ని గురి పెట్టి ఉంది. సాధారణంగా విపక్షాలు అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం వేరు. జగన్ విషయం వేరు. జగన్ కి మొదటి నుంచి రాజకీయాలకు అతీతంగా శత్రువులు ఉన్నారు. వారు మరింతంగా పెరిగిపోతున్నారు కూడా. ఇక జగన్ మిత్రులుగా కూడా ఎవరినీ భావించరు. తన రాజకీయం ఏంటో తానేంటో అన్నట్లుగా ఉంటారు. అలాంటి జగన్ తన మనస్తత్వానికి భిన్నంగా బీజేపీతో మైత్రి నడిపారు. కేంద్రంలోని మోడీని బాగా కీర్తించారు. ఆయన తిరుపతి వచ్చినపుడు ఏకంగా కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలని చూశారు.
మద్దతు తగ్గిందంటూ….
ఇన్ని చేసినా కూడా బీజేపీ ఆలోచనలు మారవు. వారు టైమ్ దొరికితే తమ టార్గెట్ ని ఠక్కున ఫినిష్ చేస్తారు. ఏపీలో కూడా ఇపుడు వారిది అదే చూపు, అదే వేట కూడా. ఏపీలో జగన్ కి గతం కంటే మద్దతు తగ్గిందని సర్వేలలో వస్తున్న నేపధ్యంలో ఆయన రాజకీయం ఏమైనా జరగవచ్చు అంటున్నారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఒక వైపు కోర్టులో ఉంది. ఆ తీర్పు ఎలా వస్తుందో ఎవరికీ తెలియవు. మరో వైపు చూస్తే అక్రమాస్తుల కేసు జోరుగా సాగుతోంది. బహుశా వచ్చే ఏడాది దాని తీర్పు వెలువడవచ్చు అంటున్నారు. ఇక చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొలిక్కి వస్తే ఆ కధ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
ఆర్థిక వ్యవస్థ కూడా…
ఇక ఏపీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నం కావడం… ఇలా జగన్ కి చాలా తలనొప్పులు ఉన్నాయి. అయితే జగన్ ఒక్కటే భావిస్తున్నట్లుగా ఉంది. తనను పాల ముంచినా నీట ముంచినా ఒక్కటేనని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కేసుల బెడద లేకుండా ఉంటే సజావుగా పాలన చేసుకుంటారు. లేకపోతే జైలుపాలు అయినా కూడా తనకు ఓకే అన్నట్లుగానే జగన్ ధోరణి ఉందని పార్టీ నేతల్లోనే చర్చ నడుస్తోంది. అది కూడా సానుభూతిని పెంచేదిగానే ఉంటుందని ఆయన అంచనా వేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు