అవమానం… ఆ పనిచేస్తారా?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విచిత్ర రాజకీయ పరిస్థితులు ప్రస్ఫుటం అవుతున్నాయి. ఇకపై మూడు రాజధానులు అంటూ అధికారపక్షం, కాదు అమరావతి ఒక్కటే రాజధాని అంటూ విపక్షం చట్టసభ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విచిత్ర రాజకీయ పరిస్థితులు ప్రస్ఫుటం అవుతున్నాయి. ఇకపై మూడు రాజధానులు అంటూ అధికారపక్షం, కాదు అమరావతి ఒక్కటే రాజధాని అంటూ విపక్షం చట్టసభ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విచిత్ర రాజకీయ పరిస్థితులు ప్రస్ఫుటం అవుతున్నాయి. ఇకపై మూడు రాజధానులు అంటూ అధికారపక్షం, కాదు అమరావతి ఒక్కటే రాజధాని అంటూ విపక్షం చట్టసభ వేదికగా సాగించిన యుద్ధం ప్రజలను మాత్రం త్రిశంకు స్వర్గంలో పెట్టినట్లే అయ్యింది. రెండు పక్షాలు పంతాలకు పట్టింపులకు పోయి ఎవరి బలాన్ని వారు చూపడంతో అసలు ఏపీ లో ఏమి జరుగుతుందో తెలియని అయోమయ వాతావరణం బాగా పెరిగింది. లేడి కి లేచిందే పరుగు అన్నట్లుగా అధికార వైసిపి, కిందపడినా పైచెయి మాదే అన్న రీతిలో విపక్ష టిడిపి నడవటం విమర్శలకు దారితీస్తుంది.
మోడీనే ఇప్పుడు జగన్ అనుసరిస్తారా …
ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి కూడా పెద్దల సభ రాజ్యసభలో ఇదే సమస్య ఎదుర్కొంటుంది. అయితే రాజ్యసభలో వుండే అత్యధికులు అంతా పారిశ్రామికవేత్తలు బడాబాబులు కావడంతో వారు ఏ పార్టీలో వున్నా సర్కార్ లాబీయింగ్ దెబ్బ తో అనేక బిల్లులు ఆమోదం పొందుతూనే వస్తున్నాయి. మరీ విపక్షాలు సహకరించని బిల్లులు విషయంలో మాత్రం ఆర్డినెన్స్ లతో లాంగించేస్తుంది. వచ్చే కాలంలో రాజ్యసభలో కూడా బిజెపి హవా కొనసాగే పరిస్థితి ఉండటంతో మోడీ సర్కార్ వీలున్నంతమందిని ఆపరేషన్ ఆకర్షణ లో లాగి మిగిలిన మెజారిటీ కోసం ఆ సమయాన్ని బట్టి వ్యవహారం నరుకొస్తుంది.
ఎమ్మెల్సీలపై……
ఇప్పుడు జగన్ సైతం ఇదే తీరులో ముందుకు వెళతారనే అంటున్నారు. ఇప్పటకే నలుగురు ఎమ్మెల్సీలు పార్టీ విప్ ను థిక్కరించారు. మండలిలో జరిగిన అవమానానికి జగన్ ఖచ్చితంగా ఎమ్మెల్సీలపై ఆపరేషన్ ఆకర్ష్ కు దిగుతారన్న ప్రచారం నడుస్తోంది. మండలిలో బలం సంపాదిస్తేనే భవష్యత్తులో ఏ బిల్లుకైనా మోక్షం ఉంటుంది. అందుకే జగన్ పార్టీ ఇకపై టీడీపీ ఎమ్మెల్సీలపై ప్రత్యేక దృష్టి పెడుతుందన్న టాక్ బలంగా విన్పిస్తుంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని చిత్ర విచిత్రాలు చుడాలిసి రావొచ్చు.