జగన్ ఎన్ని చేసినా.. ఎన్నికల ముందు `రివర్సే`.. రీజనేంటి..?
ఏపీ సీఎంగా జగన్ అనేక పథకాలు పెడుతున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. దీనికి మంచి పేరు కూడా వస్తోంది. అయితే.. ఈ పేరు.. [more]
ఏపీ సీఎంగా జగన్ అనేక పథకాలు పెడుతున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. దీనికి మంచి పేరు కూడా వస్తోంది. అయితే.. ఈ పేరు.. [more]
ఏపీ సీఎంగా జగన్ అనేక పథకాలు పెడుతున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. దీనికి మంచి పేరు కూడా వస్తోంది. అయితే.. ఈ పేరు.. ఎన్నికల వరకు నిలబడుతుందా ? అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. వచ్చే ఎన్నికల లోపు.. సీఎం జగన్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేసేలా.. ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు.
జగన్ ను పదవి నుంచి…?
“మా నాయకుడు ఉంటేనే పార్టీ నిలబడుతుంది. ఆయన లేకుండా చేయాలనేది ప్రతిపక్షాల వ్యూహంగా ఉంది. దీనిని ఎదుర్కొనడమే ఇప్పుడు గట్టి సవాల్‌గా మారింది“ అని వారు గుసగుసలాడుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు జగన్ చుట్టూ.. ఉన్న కేసులను త్వరలోనే తేల్చేయాలంటూ…ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలు.. కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇటీవల.. విజయవాడలో వీరు భేటీ అయినట్టు ఆలస్యంగా ఒక విషయం వెలుగు చూసింది. వీరిలో టీడీపీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు.
కీలక సమావేశంలో….
ముఖ్యంగా జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులను తేల్చేసే పనిని ప్రారంభించాలంటూ. సుప్రీం కోర్టులోనే కేసులు వేసేందుకు ప్రయత్నించాలని 'పై నుంచి' ఆదేశాలు అందిన దరిమిలా.. టీడీపీలో న్యాయ సలహాదారుగా కూడా ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడి నేతృత్వంలోనే ఈ సమావేశం నిర్వహించారు. దీనికి మరికొందరు.. నేతలు కూడా జతకలిసినట్టు సమాచారం. ఈ పరిణామం.. వైసీపీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే కనుక జరిగితే.. వచ్చే ఏడాది కాలంలో .. జగన్ సీఎం పదవి నుంచి తప్పుకోవడం తప్పదనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి.. తమ పార్టీని బలోపేతం చేసుకునేదిశగా ఈ నేతలు ప్రయత్నిస్తున్నా రు.
వచ్చే ఎన్నికల నాటికి….?
మరోవైపు.. ప్రజలు కూడా సంక్షేమ పథకాలు అందని వారు.. జగన్‌పై ఆగ్రహంతోనే ఉన్నారు. పన్నులు పెంచుతుండడం, నీటి మీటర్లు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం వంటివి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. దీంతో మధ్య తరగతి వర్గాల్లో ఇప్పటికే ఉన్న వ్యతిరేకత పెరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల లోపే..జగన్ సర్కారుపై విముఖత పెరిగేలా చేసుకుని.. తమ పట్టు సాధించేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఎన్ని చేసినా.. ఎన్నికల నాటికి రివర్స్ అవుతుందనే లెక్కలు వస్తున్నాయి. మరి జగన్ వీటిని ఎలా తట్టుకుని నిలబడతారో ? చూడాలి.