కొలాప్స్ అయిపోయినట్లేనా?
జగన్ రావాలి. కావాలి అన్న వారే పెదవి విరుస్తున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ప్రస్తుతం ఏపీలో గ్రౌండ్ రియాలిటీలో ఎవరి నోట విన్నా ఇదే [more]
జగన్ రావాలి. కావాలి అన్న వారే పెదవి విరుస్తున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ప్రస్తుతం ఏపీలో గ్రౌండ్ రియాలిటీలో ఎవరి నోట విన్నా ఇదే [more]
జగన్ రావాలి. కావాలి అన్న వారే పెదవి విరుస్తున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ప్రస్తుతం ఏపీలో గ్రౌండ్ రియాలిటీలో ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. ఎవరికైనా తమకు మేలు చేస్తేనే మంచి నేత అంటారు. కానీ జగన్ మాత్రం పేదలు, పధకాలూ అంటూ అక్కడే ఆగిపోయారు. దానికి మించి ఆయన ఒక్క పని కూడా కొత్తగా చేయలేకపోతున్నారు. జగన్ కోసం ఎంతో చేసిన ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆయన పట్టించుకోవడంలేదు. మరో వైపు చూస్తే ఏపీలో ఎన్నో వర్గాలు ఉన్నాయి. వారంతా ఈ ప్రభుత్వం వచ్చాక తమకేమి చేసింది అని ప్రశ్నిస్తున్నారు. తాము పన్నులు కడితే పేదలకు పంచి తమ సంచికి చిల్లు పెడుతున్నారు అన్నది మధ్యతరగతి వర్గాల భావన. ఇక ఉన్నత వర్గాలు సైతం ఏపీలో ఏమీ జరగడంలేదు అంటూ తేల్చేస్తున్నారు.
జగన్ వల్ల అవుతుందా?
ఇదిలా ఉంటే జగన్ ఇపుడు అతి పెద్ద ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నారు. దాని నుంచి బయటపడడం జగన్ వల్ల అవుతుందా ? అంటే కాదనే నూటికి అరవై శాతం అంటున్నారు. ఏపీలో బండి నడవాలి అంటే ఆదాయ మార్గాలు పెరగాలి. కానీ జగన్ అనుభవ లేమితో ఉన్న పరిశ్రమలకే ఇబ్బందులు తెస్తున్నారు. కొత్తగా మరేమీ రాకుండా పోతున్నాయి. ప్రభుత్వ పారిశ్రామిక విధానం కూడా అయోమయంగా ఉందని అంటున్నారు. నిజానికి జగన్ ఒక పారిశ్రామికవేత్తగా సక్సెస్ అయ్యారు. ఆయనే సీఎం అయిన వేళ పరిశ్రమలు ఏపీకి రాకపోవడం విడ్డూరమే అంటున్నారు. ఏపీకి ఏటా లక్ష కోట్లకు పైగా వివిధ మార్గాల దాకా ఆదాయం వస్తుంది. దాని మీద అప్పులు చేయాల్సి ఉండేది.
ఆదాయం పడిపోవడంతో…
కానీ జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. డెబ్బై వేల కోట్లు దాటి ఆదాయాలు రావడంలేదు. దానికి తోడు జగన్ హామీలతో ఖర్చులు పెరిగాయి. కరోనా కూడా తోడు కావడంతో రెవెన్యూ ఎక్కడికక్కడ దారుణంగా పడిపోయింది. ఈ నేపధ్యంలోనే జగన్ జీతాలు కూడా ఉద్యోగులకు ఇవ్వలేకపోతున్నారు అంటున్నారు. ఇక ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే ఏదో సమయంలో ఏపీ కోలాప్స్ స్టేజ్ కి చేరుకుంటుంది అంటున్నారు. ఏపీ పాలన, ఆర్ధిక విషయాల మీద అవగాహన ఉన్న వారు జగన్ వీటిని డీల్ చేయడం కష్టమే అనేస్తున్నారు.
అద్భుతమేనా?
ఏపీకి ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సంక్షోభం నుంచి జగన్ బయటపడితే అది అద్భుతమే అవుతుంది అని కూడా వారు అంటున్నారు. సరిగ్గా ఈ పాయింటే ఇపుడు అపోజిషన్ లో ఉన్న టీడీపీలో ఆశలు రేపుతోంది. జగన్ ఏమీ కాకుండా ఒక ఫెయిల్యూర్ సీఎం గా మిగిలిపోతే ఏపీలో ఎప్పటికీ అధికారం తమ దగ్గరే ఉంటుంది అని పసుపు పార్టీ పెద్దలు తలపోస్తున్నారు. మరి రావాలి జగన్ కాదు, గెలవాలి జగన్ అని ఆయన శ్రేయోభిలాషులు ఇపుడు అంతా కోరుకుంటున్నారు. ఏదేమైనా వచ్చే రెండేళ్లు అటు జగన్కు పెద్ద అగ్నిపరీక్షే..