ys jagan : జగన్ నిర్ణయంతో వారి ఆశలు హుళక్కేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రి వర్గ విస్తరణ మరో ఆరు నెలలు వాయిదా వేయాలని జగన్ నిర్ణయంచారని సమాచారం. నిజానికి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రి వర్గ విస్తరణ మరో ఆరు నెలలు వాయిదా వేయాలని జగన్ నిర్ణయంచారని సమాచారం. నిజానికి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రి వర్గ విస్తరణ మరో ఆరు నెలలు వాయిదా వేయాలని జగన్ నిర్ణయంచారని సమాచారం. నిజానికి మరికొద్ది రోజుల్లో ఏపీ మంత్రి వర్గ విస్తరణ జరగాలి. జగన్ ప్రమాణస్వీకారానికి ముందు ప్రస్తుత మంత్రివర్గం కాలవ్యవధి రెండున్నరేళ్లు అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం మందిని మారుస్తానని కూడా జగన్ చెప్పారు.
మరో ఆరునెలలు వాయిదా?
అయితే ప్రస్తుతం మంత్రి వర్గ విస్తరణను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని జగన్ నిర్ణయించారని సమాచారం. ఇందుకు గల కారణాలను కూడా వైసీపీ అగ్రనేతలు చెబుతున్నారు. మంత్రి వర్గం ఏర్పాటయిన తర్వాత ముప్పావు సమయం కరోనాతోనే గడచిపోయింది. మంత్రులు కూడా తమకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించలేకపోయారు. తొలుత రెండున్నరేళ్లు అని అనుకున్నా మరో ఆరు నెలల సమయాన్ని ప్రస్తుత మంత్రులకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.
రెండేళ్ల పాటే…
కొత్త మంత్రివర్గాన్ని మూడేళ్ల తర్వాత అంటే మరో ఆరునెలల అనంతరం విస్తరించాలన్నది జగన్ ఆలోచన. ఇందులో కూడా పూర్తిగా ఎన్నికల టీమ్ ను నియమించాలని జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పదిశాతం మందిని ఉంచినా, 90 శాతం మంత్రుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఎక్కువ మంది కేబినెట్ లో బలహీన వర్గాల వారు ఉంటారన్నది పార్టీ వర్గాల ద్వారా విన్పిస్తున్న టాక్. వీరికి రెండేళ్ల పదవీ కాలం ఉంటుంది.
ఎందరో ఆశలు…
కానీ మంత్రి వర్గ విస్తరణపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గం నేతలు అధిక మంది ఈసారి తమకు ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి వంటి నేతలు తమకు ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం వీరి ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పాలి. మరి జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే ఈ టర్మ్ కు వీరందరికీ మంత్రి పదవి దక్కనట్లే.