Ycp : జగన్ లో “అనంత” ఉపాయాలు? నేతల్లో టెన్షన్
అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ ప్రారంభమయింది. మంత్రి వర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతుండటంతో జగన్ తీసుకోబోయే నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనంతపురం [more]
అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ ప్రారంభమయింది. మంత్రి వర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతుండటంతో జగన్ తీసుకోబోయే నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనంతపురం [more]
అనంతపురం జిల్లా వైసీపీ నేతల్లో టెన్షన్ ప్రారంభమయింది. మంత్రి వర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతుండటంతో జగన్ తీసుకోబోయే నిర్ణయం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఈసారి మంత్రి వర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అని నమ్మకం పెట్టుకున్న నేతలకు సామాజిక సమీకరణాలు టెన్షన్ పెడుతున్నాయి.
రెడ్డి సామాజికవర్గం నేతలే….
అనంతపురం జిల్లాలో ఎక్కువగా మంత్రి పదవి పై ఆశలు పెట్టుకుంది రెడ్డి సామాజికవర్గం నేతలే. అయితే ఇక్కడ ఈసారి ఎవరికి మంత్రి పదవి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తొలి మంత్రి వర్గ విస్తరణలో ఎవరూ ఊహించని విధంగా పెనుకొండ నుంచి గెలిచిన శంకరనారాయణకు మంత్రి పదవి దక్కింది. ఆయన కురుబ సామాజికవర్గం కావడంతో మంత్రి పదవిని తొలి దఫా దక్కించు కున్నారు. అనంతపురంలో ఒక్కరికే మంత్రి పదవిని జగన్ కేటాయించారు.
కురుబ సామాజికవర్గం….
అయితే ఈసారి కూడా అదే సామాజికవర్గానికి మంత్రి పదవి ఇస్తారన్న టాక్ వైసీపీ రెడ్డి సామాజికవర్గం నేతల గుండెల్లో గుబులు రేపుతుంది. కురుబ సామాజికవర్గానికే ఈసారి మంత్రి పదవి ఇచ్చే పనైతే కల్యాణదుర్గం నుంచి గెలిచిన ఉషశ్రీ చరణ్ కు ఇస్తారన్న టాక్ కూడా ఉంది. తొలిసారి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఉషశ్రీ చరణ్ ఎక్కువగా నియోజకవర్గం లో ఉండకుండా బెంగళూరుకు పరిమితమయ్యారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ఎన్నికల టీం కావడంతో….
అలాగే ఎస్సీ కోటాలో శింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేరు కూడా బలంగా విన్పిస్తుంది. వీరిద్దరిని దాటుకుని రెడ్డి సామాజికవర్గానికి పదవులు దక్కాల్సి ఉంటుంది. ఎన్నికల టీమ్ కావడంతో ఖచ్చితంగా జగన్ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కాపు రామచంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వంటి నేతలు టెన్షన్ పడుతున్నారు. వెంకట్రామిరెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయన ఈ మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.