Ycp : ఈసారి హోంమంత్రి ఈమేనట
జగన్ ను మాటలను బట్టి చూస్తే ఈసారి కూడా హోంమంత్రి మహిళే ఉండనున్నారు. ఉపముఖ్యమంత్రిగా కూడా నియమించనున్నారు. ఆయన ప్రసంగాలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి [more]
జగన్ ను మాటలను బట్టి చూస్తే ఈసారి కూడా హోంమంత్రి మహిళే ఉండనున్నారు. ఉపముఖ్యమంత్రిగా కూడా నియమించనున్నారు. ఆయన ప్రసంగాలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి [more]
జగన్ ను మాటలను బట్టి చూస్తే ఈసారి కూడా హోంమంత్రి మహిళే ఉండనున్నారు. ఉపముఖ్యమంత్రిగా కూడా నియమించనున్నారు. ఆయన ప్రసంగాలు ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి సభలో జగన్ తాను హోంమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నియమించానని చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సుచరిత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
తిరిగి మహిళనే….
కానీ త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో మేకతోటి సుచరితను జగన్ తప్పించనున్నారు. అయితే ఆమెను తప్పించినా అదే స్థానాన్ని మహిళకు కేటాయించే అవకాశాలున్నాయి. ఎందుకంటే వచ్చేది ఎన్నికల సమయం. ఇప్పుడు కూర్పు చేసే మంత్రి వర్గం ఎన్నికల వరకూ ఉంటుంది. అందుకే ఈ మంత్రివర్గంలోనూ మహిళలను ఎక్కువ సంఖ్యలో నియమించుకోవడం కాకుండా, హోంమంత్రిగా మహిళకే అవకాశమిస్తారని తెలుస్తోంది.
కొద్ది మందే గెలవడంతో….
అయితే మహిళల్లో హోంమంత్రి పదవి ఎవరికి ఇస్తారన్న చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. ఎస్సీ సామాజికవర్గానికే తిరిగి జగన్ హోంమంత్రి పదవి ఇస్తారంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా పురుషులే గెలిచారు. కేవలం మూడు చోట్ల మాత్రమే ఎస్సీ మహిళలు విజయం సాధించారు.
ఇద్దరు మాత్రమే…..
ఇందులో తొలి మంత్రివర్గంలోనే ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత, కొవ్వూరు నుంచి తానేటి వనిత కు అవకాశం కల్పించారు. ఇక మిగిలింది శింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి మాత్రమే గెలిచారు. ఉండవల్లి శ్రీదేవికి హోంమంత్రి దక్కే ఛాన్స్ లేదు. ఇక కొత్తగా బద్వేలు ఉప ఎన్నికల్లో గెలిస్తే దాసరి సుధ ఎస్సీ మహిళ ఎమ్మెల్యే అవుతారు. దీన్ని బట్టి ఏ కోణంలో చూసినా జొన్నలగడ్డ పద్మావతికి హోంమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నారు. ఈక్వేషన్లు మారితే చెప్పలేంకాని, మరోసారి మహిళకే హోంమంత్రి పదవి దక్కే అవకాశమయితే కన్పిస్తుంది.