Ys jagan : జగన్ ను కలిస్తే పాపం చుట్టుకుంటుందేమో?
నిజమే… మోహన్ బాబు అన్నారని కాదు కాని.. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం చిత్ర పరిశ్రమ ఇచ్చిందా? జగన్ ను అసలు ముఖ్యమంత్రిగా చూసిందా? ఆయన అవసరం [more]
నిజమే… మోహన్ బాబు అన్నారని కాదు కాని.. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం చిత్ర పరిశ్రమ ఇచ్చిందా? జగన్ ను అసలు ముఖ్యమంత్రిగా చూసిందా? ఆయన అవసరం [more]
నిజమే… మోహన్ బాబు అన్నారని కాదు కాని.. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం చిత్ర పరిశ్రమ ఇచ్చిందా? జగన్ ను అసలు ముఖ్యమంత్రిగా చూసిందా? ఆయన అవసరం మనకేంటి? అన్న ధోరణి మాత్రమే చిత్ర పరిశ్రమ పెద్దల్లో కన్పించింది. చిరంజీవి వంటి వారు తమ సినిమాల ప్రమోహన్ కోసం జగన్ ను ఒకటికి రెండుసార్లు కలసి వచ్చినా అది కృతకంగానే కన్పించింది. చిత్ర పరిశ్రమలో 90 శాతం మంది జగన్ ను ముఖ్యమంత్రిగా చూడలేక అమరావతి వైపు అడుగువేయలేదన్నది వాస్తవం.
నామినేటెడ్ ముఖ్యమంత్రిలాగా….
ఏం జగన్ నామినేటెడ్ ముఖ్యమంత్రా? లేక ఎవరి ముఖ్యమంత్రి పదవినైనా గింజుకుని సీఎం పదవిని చేపట్టారా? బరాబర్ ప్రజల్లోకి వెళ్లి 151 సీట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పడానికి కూడా మనసు రాలేదు. సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ కాసుల వర్షం కురిపిస్తుంది. ఏపీలో ఏకైక వినోదం సినిమాయే కావడంతో అక్కడి నుంచి వచ్చే కలెక్షన్లతోనే సినీ పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. ఆ ప్రాంతం నుంచి వసూళ్లను ఆశించే సినీ పెద్దలకు ముఖ్యమంత్రి జగన్ అవసరం మాత్రం ఉండదు. చంద్రబాబు సీఎం అయ్యాక అమరావతికి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు కన్పించరే?
ఆంధ్రా నుంచే ఆదాయం….
తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే సినిమా థియేటర్లు ఎక్కువ. ప్రేక్షకుల శాతం కూడా అక్కడ ఎక్కువే. అయితే ఆ సినిమా హాళ్లన్నీ ఒకరిద్దరి చేతులోనే ఉన్నాయి. వారే సినిమా నుంచి వచ్చిన కలెక్షన్లను ఇంటికి తీసుకెళుతున్నారు. ఇప్పుడు సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఒకరిద్దరు గింజుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం జనసేన పార్టీయే. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు పవన్ కల్యాణ్ ఒక ఆదాయవనరుగా మారారు. పవన్ తో సినిమా చేస్తే కోట్లు కూడబెట్టుకోవచ్చు.
ఆ ఫ్యామిలీ చేతుల్లో…
దీంతో పాటు టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ చక్రం తిప్పుతుండటం, చిత్ర పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆ ఫ్యామిలీపై దాదాపు యాభై శాతం మంది ఆధారపడి ఉండటమే జగన్ ను వ్యతిరేకించడానికి కారణంగా చూడాలి. చిరంజీవి వచ్చి కలవడాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా ప్రమోషన్ కోసమే నాడు వచ్చాడు తప్ప. మరో కారణం కాదు. అందుకే ముఖ్యమంత్రిని గౌరవించాలన్న కనీస స్పృహ చిత్ర పరిశ్రమలో ఎవరికీ లేదు. మా అసోసియేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కరెన్సీ నోట్లతో కళ్లుమూసుకునిపోయిన కొందరికి కొరడాతో కొట్టినట్లయింది. మరి మోహన్ బాబు అన్న మాటల్లో తప్పేముంది?