బీగం వేశానన్న జగన్
జగన్ దూకుడు తో మండలి రద్దు కావడం ఖాయమన్న సంకేతాలతో టిడిపి నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమ్యెల్సీగా ఉన్న వారిలో రేగిన గుబులు అంతా ఇంతా [more]
జగన్ దూకుడు తో మండలి రద్దు కావడం ఖాయమన్న సంకేతాలతో టిడిపి నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమ్యెల్సీగా ఉన్న వారిలో రేగిన గుబులు అంతా ఇంతా [more]
జగన్ దూకుడు తో మండలి రద్దు కావడం ఖాయమన్న సంకేతాలతో టిడిపి నేతల్లో టెన్షన్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమ్యెల్సీగా ఉన్న వారిలో రేగిన గుబులు అంతా ఇంతా కాదు. దాంతో దాదాపు 17 మంది ఎంఎల్సీలు వైసిపి టచ్ లోకి వెళ్లారంటే పదవీగండం వారిని ఏ స్థాయిలో గందరగోళం లోకి నెట్టిందో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో టిడిపి తమ సభ్యులను ప్రలోభ పెడుతున్నారని గట్టిగానే ప్రచారం ఆరంభించింది. దాంతో అటు అధికార విపక్షాల నడుమ ఉప్పు నిప్పులా వ్యవహారం మారిపోయింది.
నన్ను చంద్రబాబు ను చేయొద్దన్న జగన్ …
తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆ పార్టీ కి దూరం జరుగుతున్నారన్న సమాచారం కొందరు ముఖ్య నేతలు తమ అధినేత జగన్ కి చేరవేశారు. దీనిపై జగన్ బాగా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. తనను మరో చంద్రబాబు గా మార్చొద్దని వారిని వారించారంటున్నారు. ఓటుకు నోటు కేసు తరహాలో దిగజారి వెళితే రేపు ప్రజలకు ఏమి సమాధానం చెబుతామని వారికి హితబోధ చేసినట్లు తెలుస్తుంది.
ఆరోపణల నేపథ్యంలో…..
తమ సభ్యులకు ఇప్పటికే కార్లు, ప్లాట్ లు ఇస్తామంటూ వైసిపి ప్రలోభాలకు దిగిందని చంద్రబాబు ఆరోపణలకు దిగిన నేపథ్యంలో జగన్ ఈ వ్యవహారాలపై బాగా సీరియస్ అయినట్లు ఆ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. తాను తొలి నుంచి చెబుతున్నానని, పార్టీ వీడి వస్తే రాజీనామా చేసి రావాలని చెప్పానని జగన్ వారికి క్లాస్ పీకినట్లు సమాచారం. ఎమ్మెల్సీలను తీసుకునే అవకాశమే లేదని జగన్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అందుకే తన నిర్ణయం మండలి రద్దు అన్నది స్పష్టం చేసేయడంతో వైసిపి లోని మండలి వర్గాలు నిరాశ తో వెనక్కి వెళ్లినట్లు తెలుస్తుంది.