Ys jagan : చాన్నాళ్ల తర్వాత గుర్తొచ్చారా బాసూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో పాటు పార్టీ క్యాడర్, అక్కడ ఉన్న ముఖ్యనేతల పరిస్థితిపై కూడా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో పాటు పార్టీ క్యాడర్, అక్కడ ఉన్న ముఖ్యనేతల పరిస్థితిపై కూడా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో పాటు పార్టీ క్యాడర్, అక్కడ ఉన్న ముఖ్యనేతల పరిస్థితిపై కూడా జగన్ తెలుసుకోవాలని భావిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతుంది. ఇప్పటి వరకూ కార్యకర్తలను పట్టించుకోలేదు. పార్టీని కూడా లైట్ గానే తీసుకున్నారు. దీంతో క్యాడర్ లో కొంత అసంతృప్తి ఉందన్నది జగన్ కు స్పష్టంగా తెలిసింది.
కార్యకర్తలే ముఖ్యం….
ఏ పార్టీకైనా కార్యకర్తలు ముఖ్యం. పోలింగ్ కేంద్రాల్లో వాళ్లే పార్టీని రక్షించగలిగేది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లగలిగేది వాళ్లే. అటువంటి కార్యకర్తలను గత రెండున్నరేళ్లుగా జగన్ విస్మరించారు. పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు పదవులు ఇవ్వడం మినహా క్యాడర్ కు చేసింది ఏమీ లేదు. అయితే నియోజకవర్గాల వారీగా ముఖ్యమైన కార్యకర్తలను గుర్తించి వారిని పార్టీ పరంగా ఏదో ఒకటి చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది.
వంద మందిని గుర్తించి….
ఎవరెంత కాదనుకున్నా వచ్చే ఎన్నికల్లో తిరిగి వారి అవసరమే జగన్ కు ఉంటుంది. జెండా పట్టుకుని వారు రోడ్డు మీదకు రాకుంటే పార్టీ విజయం అంత సులువు కాదు. ఇప్పటికే కార్యకర్తలకు వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరినట్లు జగన్ గుర్తించారు. కేవలం పథకాలు మాత్రమే కాకుండా పార్ట పరంగా వారికి ఏదో ఒక ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. నియోజకవర్గానికి వంద మంది కార్యకర్తలను గుర్తించాలని భావిస్తున్నారు.
వారి సమస్యలు విని….
అంటే ఒక్కొక్క మండలానికి పది మంది కార్యకర్తలను తొలిదశలో గుర్తిస్తారు. వారితో ఆ జిల్లా మంత్రులు సమావేశమవుతారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారు. ఆరోగ్య, విద్యపరమైన సమస్యలుంటే ప్రభుత్వ పరంగా వారికి సాయం చేస్తారు. వ్యక్తిగత సమస్యలయితే దానిపై స్థానిక ఎమ్మెల్యలు, ముఖ్యనేతలతో చర్చించి పార్టీ పరంగా వారికి సాయం అందించాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. దీనిపై ప్రణాళికను రూపొందించాలని జగన్ సీనియర్ నేతలను ఆదేశించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ అధికారంలోెకి వచ్చిన మూడేళ్ల తర్వాత పార్టీ క్యాడర్ పై దృష్టి పెట్టారు.