Chandrababu : ఢిల్లీ టూర్ తర్వాత బాబు అలాగే ఫిక్స్ అయ్యారా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు ఢిల్లీలో నెట్ వర్క్ పూర్తిగా పోయిందని పార్టీ నేతలే చెబుతున్నారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు ఢిల్లీలో నెట్ వర్క్ పూర్తిగా పోయిందని పార్టీ నేతలే చెబుతున్నారు. [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు ఢిల్లీలో నెట్ వర్క్ పూర్తిగా పోయిందని పార్టీ నేతలే చెబుతున్నారు. సిమ్ డెడ్ కావడంతోనే ఢిల్లీ టూర్ అట్టర్ ప్లాప్ అయిందన్నది అనేక మంది నేతల అభిప్రాయం. చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీలో పలుకరించే నేతలే కరువయ్యారు. ఇందుకు ఆయన స్వయంకృతాపరాధమే కారణమన్నది పార్టీనేతలు కూడా అంగీకరిస్తున్నారు.
డిమాండ్ అభ్యంతరకరం….
చంద్రబాబు ప్రధాన డిమాండ్ అభ్యంతరకరంగా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టాలన్న డిమాండ్ తో ఢిల్లీ వెళితే ఎవరైనా ఈయన వైపు చూస్తారా? అన్నది ఒక సీనియర్ నేత సీరియస్ కామెంట్. అవును… తన పార్టీ కార్యాలయంపైనా, తన పార్టీ నేతలపైన దాడులు జరుగుతున్నాయని, రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వేధిస్తుందని చెబుతూ ఫిర్యాదు చేసేందుకు వెళితే కొంత మద్దతు లభించి ఉండేది. కానీ చంద్రబాబు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రధాన డిమాండ్ గా వెళ్లడమే అక్కడ సిగ్నల్స్ కట్ చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.
పునరాలోచనలో….
మరోసారి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని సర్ది చెప్పుకుంటున్నారు తప్పించి, ఢిల్లీ ప్రయాణ డిమాండ్ సహేతుకంగా లేకపోతే ఎప్పటికీ వారి నుంచి అనుకూల సంకేతాలు రావు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు సయితం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. తాను బీజేపీకి దగ్గరవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తనతో కలసి రాదన్న సంగతి ఢిల్లీ టూర్ లో అర్థమయింది.
జనసేనను వేరు చేసి….
అందుకే ఆయన ఇక ఢిల్లీ సిగ్నల్స్ కట్ అయ్యాయని ఫిక్స్ అయ్యారు. చంద్రబాబు ఇప్పడు పవన్ కల్యాణ్ ను తన చెంత చేర్చుకోవడంపైనే దృష్టి పెడతారు. బలంగా ఉన్న జగన్ ను ఈ పరిస్థితుల్లో ఎదుర్కొనలేరు. పవన్ కల్యాణ్ అండ అవసరం. సామాజికంగా, క్యాడర్ పరంగా అండ ఉంటేనే జగన్ కు కొద్దోగొప్పో పోటీ ఇవ్వగలమన్నది చంద్రబాబు ఆలోచన. బీజేపీ నుంచి పవన్ ను బయటకు తెచ్చి తన గూటిలోకి రప్పించాలన్నదే చంద్రబాబు ముందున్న కర్తవ్యం. అందుకే ఇప్పుడు బీజేపీ నుంచి జనసేనను వేరు చేసే ప్రయత్నాలు ఇక మొదలవుతాయి.