Ys jagan : ఆ సాహసం చేయగలిగితే మళ్లీ విజయమేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు మూడేళ్ల ముందే కసరత్తు ప్రారంభించారు. సర్వేల పైన సర్వేలు చేయిస్తున్నారు. ఈసారి 30 నుంచి 40 మంది మంది సిట్టింగ్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు మూడేళ్ల ముందే కసరత్తు ప్రారంభించారు. సర్వేల పైన సర్వేలు చేయిస్తున్నారు. ఈసారి 30 నుంచి 40 మంది మంది సిట్టింగ్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలకు మూడేళ్ల ముందే కసరత్తు ప్రారంభించారు. సర్వేల పైన సర్వేలు చేయిస్తున్నారు. ఈసారి 30 నుంచి 40 మంది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లభించడం కష్టమేనంటున్నారు. ప్రత్యర్థి పార్టీల పొత్తుల ఆధారంగా ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉండనుంది. అందుకే జగన్ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనసేన, టీడీపీ పొత్తు ఉన్నప్పుడు అనేక చోట్ల అభ్యర్థులను మార్చాల్సి ఉంటుందన్నది వైసీపీ అధిష్టానం భావనగా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో….
వచ్చే ఎన్నికల్లో గెలిస్తే జగన్ తాను అనుకున్నట్లు టీడీపీని ఏపీలో పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చు. ఈసారి ఎన్నికలే టీడీపీ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. అందుకోసం జగన్ ఈసారి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా రాయలసీమలోని చిత్తూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలోని సిట్టింగ్ స్థానాల్లో ఎక్కువ మందికి ఉద్వాసన పలికే అవకాశముందంటున్నారు.
బలంగా ఉన్న చోట….
ముఖ్యంగా కాపు, కమ్మ ఓటు బ్యాంకు బలంగా ఉన్న చోట్ల ప్రస్తుత ఎమ్మెల్యేలు కొందరు బలహీనంగా ఉంటారని జగన్ కు అందుతున్న సర్వేల ప్రకారం తెలుస్తోంది. ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలు జగన్ కు అందినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలపైనే ఎక్కువ వ్యతిరేకత ఉండటం, ప్రభుత్వంపైన, జగన్ పైన సానుకూల వాతావరణం ఉండటంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను మార్చడం తప్పనిసరి అని తెలుస్తోంది.
ఇప్పటికే కొందరికి సంకేతాలు…
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దొరకని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అధికారంలోకి వచ్చిన వెంటనే పదవుల హామీ ఇచ్చి వారి నుంచి ఎన్నికల్లో సహకారం తీసుకోవాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఇంత పెద్దయెత్తున సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం ఆషామాషీ విషయం కాదు. కానీ మరోసారి వైసీపీ అధికారంలోకి రావాలంటే త్యాగాలు చేయక తప్పదు. ఇప్పటికే పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేలకు సంకతాలు అందడంతో వారు టెన్షన్ పడుతున్నారు. మరి జగన్ ఈ సాహసం చేయగలరా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.