ఢిల్లీ రిజల్ట్.. ఏపీలోనూ రిపీట్ అవుతుందా?
అదేంటి..? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కనీసం ఏడాది కూడా అవలేదు. మళ్లీ అప్పుడే ఈ అంచనాలేంటి…? అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్రంలో రాజకీయాలు హాట్ [more]
అదేంటి..? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కనీసం ఏడాది కూడా అవలేదు. మళ్లీ అప్పుడే ఈ అంచనాలేంటి…? అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్రంలో రాజకీయాలు హాట్ [more]
అదేంటి..? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి కనీసం ఏడాది కూడా అవలేదు. మళ్లీ అప్పుడే ఈ అంచనాలేంటి…? అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు లేకపోయినా ప్రతిపక్షాలు సహజంగానే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే ప్రాతిపదికన అంచనా వేయడం సహజం. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో వచ్చిన ఫలితాల ను కంపేర్ చేసుకుంటున్న వైసీపీ, టీడీపీ నాయకులు ఏపీలో అదే తరహా పాలన ఉంటే.. రిజల్ట్ కూడా ఇలానే ఉంటాయని లెక్కలు వేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
కేంద్ర సహకరించకున్నా….
తాజాగా వచ్చిన ఢిల్లీ ఫలితాలను విశ్లేషిస్తున్నవారు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడానికి వెనుక ఉన్న అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రజల మనిషిగా, పనిచేసే మనిషిగా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎదిగారు. తాను ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చేందుకు ఆయన కట్టుబడ్డారు. కేంద్రం సహకరించకపోయినా ఆయన తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటివిషయాల్లో ఆయన దూకుడుగా ముందుకు సాగారు.
ఢిల్లీ ఫలితమే ఏపీలోనూ….?
ముఖ్యంగా నగరానికి ఆవల ఉండే మురికి వాడలను అభివృద్ధి చేసేందుకు ఎంతో శ్రమించారు. ఈ పరిణామమే కేజ్రీపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచింది. ముచ్చటగా మూడో సారి సీఎం అయ్యేలా చేసింది. అదే టైంలో కేంద్రం కేజ్రీవాల్‌ను టార్గెట్ చేయడం కూడా అంతిమంగా ఆయనకే ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఏపీకి వద్దాం. మరో నాలుగు సంవత్సరాల తర్వాత ఏపీలోనూ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఇప్పుడు ఢిల్లీలో వచ్చిన ఫలితమే ఏపీలోనూ వస్తుందా ? అంటే సహజంగానే అనేక సందేహాలు వస్తాయి.
పాఠశాలల దగ్గర నుంచి…..
ఢిల్లీ, ఏపీ రాజకీయాలను సరిపోల్చలేం. అయితే ఇక్కడ జగన్ ఎలాంటి సంక్షేమ పథకాలతో జనాల్లోకి వెళుతున్నాడో ? అక్కడ కేజ్రీవాల్ సైతం అదే తరహాలో వెళ్లి ఓటర్ల మనస్సులు కొల్లగొట్టి మరోసారి విజయం సాధించారు. ఇద్దరికి కేంద్రం నుంచి సహకారం లేదు. ఇక ఏపీలో ప్రస్తుతం పాలన జరుగుతోన్న తీరు చూస్తుంటే ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన కనెక్టివిటీ అలా ఉందని రీజన్ కూడా చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సేవలను ఇంటికే అందిస్తున్నారు. పాఠశాలలను మెరుగు పరిచే చర్యలకు పూనుకున్నారు.
మౌలిక సదుపాయాల కల్పన….
జగన్ మౌలిక సదుపాయాలు, సంక్షేమమే టార్గెట్‌గా ముందుకు వెళుతున్నారు. వైద్యాన్ని మరింత చేరువ చేస్తున్నారు. అవినీతి రహిత సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇవే కదా.. ఢిల్లీ ప్రజలను మెప్పించింది..సో.. ఏపీలోనూ జగన్ వచ్చే నాలుగేళ్ల పాటు ఇదే తరహా పాలన కంటిన్యూ చేస్తే ఇక్కడ కూడా జగన్ మళ్లీ గెలిచే ఛాన్స్ ఉంది. అయితే అప్పటికి ఎలాంటి రాజకీయ సమీకరణలు, పొత్తులు, ఎత్తులు ఉంటాయో ? కూడా చూడాలి.