జగన్ కిక్కు తెప్పిస్తారా? లేదా?
మద్యం దొరక్క మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. అలాగే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం తెచ్చిపెట్టే మద్యం బంద్ చేయడంతో ఖజానాకు చిల్లు పడిపోతుంది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు కిక్కిచ్చే [more]
మద్యం దొరక్క మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. అలాగే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం తెచ్చిపెట్టే మద్యం బంద్ చేయడంతో ఖజానాకు చిల్లు పడిపోతుంది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు కిక్కిచ్చే [more]
మద్యం దొరక్క మందుబాబులు పిచ్చెక్కిపోతున్నారు. అలాగే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం తెచ్చిపెట్టే మద్యం బంద్ చేయడంతో ఖజానాకు చిల్లు పడిపోతుంది. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు కిక్కిచ్చే శుభవార్త కేంద్రం ఇచ్చింది. గ్రీన్ ఆరెంజ్ జోన్స్ లో మద్యం దుకాణాలను తెరుచుకోవచ్చని తన లాక్ డౌన్ మార్గదర్శకత్వాల్లో నిర్ధేశించింది. అయితే ఆయా రాష్ట్రాలు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని తేల్చింది.
ఓపెన్ అయిపోతున్నాయి …
ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు మద్యం దుకాణాలను హడావిడిగా తెరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టేశాయి. ఇప్పటికే మద్యం దొరక్క చాలామంది ఆసుపత్రులు పాలయ్యారు. కొందరు అయితే పిచ్చి ఆసుపత్రుల్లో చేరారు. మరికొందరు కల్తీ మద్యం గుడుంబా తాగి, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ మరణాలు ఏ సంఖ్యలో ఉన్నాయి అంటే కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయిన వారి సంఖ్యతో సమానంగా వీరి సంఖ్య ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కేంద్రం మొత్తానికి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో మద్యం ప్రియులు ఆనందానికి అంతే లేదు.
ఎటు తేల్చని జగన్ …
మద్యం అంటే అస్సలు నచ్చని ఎపి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ లో ఒకే ఒక్క జిల్లా గ్రీన్ జోన్ లో ఉండగా 8 జిల్లాలు ఆరెంజ్ జోన్ లో మిగిలిన నాలుగు జోన్స్ రెడ్ జోన్స్ గా కొనసాగుతున్నాయి. దాంతో జగన్ గ్రీన్ జోన్ కే ఎస్ అంటారా ? ఆరెంజ్ కి కూడా అనుమతి ఇస్తారా ? లేక మొత్తానికి మద్యం షాపుల మూసివేతకు నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఆసక్తికర చర్చ మొదలైంది. ఏపీ సర్కార్ ఒక వేళ మద్యం షాపులు తీయకూడదు అనుకుంటే సరిహద్దు రాష్ట్రాల్లో వీటి అమ్మకాలు జరిగితే అక్రమంగా మందు ప్రవాహం మొదలు అవుతుంది. అదే జరిగితే ఏపీ మద్యం ద్వారా సమకూరే పన్నులు నష్టపోతుంది. ఈ నేపథ్యంలో మద్యం షాపులు తీయక తప్పని పరిస్థితిని జగన్ సర్కార్ ఎదుర్కోనుంది. అయితే మద్య వ్యతిరేకి జగన్ ఏమి చేస్తారన్నది హాట్ టాపిక్ ఇప్పుడు.